రైనా మేనత్త కుటుంబంపై ఎంత ఘోరంగా దాడి జరిగిందంటే .. సీఎం ప్రకటన !

Update: 2020-09-16 13:30 GMT
సురేష్ రైనా .. ఐపీఎల్ 2020 కోసం దుబాయ్ వెళ్లి అర్థంతరంగా ఇండియాకి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. దానిపై భిన్నమైన వాదనలు అయితే వినిపించాయి. అయితే రైనా తన మేనత్త కుటుంబం పై దారుణ దాడి జరగడం వల్లే ఇండియాకి తిరిగివచ్చాడు అని తెలుస్తుంది. ఇకపోతే , తాజాగా రైనా మేన‌త్త కుటుంబం పై దాడి సంఘటన‌పై పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ ప్ర‌క‌ట‌న చేశారు. ఆ పని అంత‌రాష్ట్ర దొంగ‌ల ముఠా ప‌ని అని, వారిని అరెస్ట్ చేసిన‌ట్లు వెల్లడించారు. ఈ కేసులో మ‌రో 11మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని అన్నారు.

ఆగస్టు 19న అర్ధ‌రాత్రి పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌ కోట్ జిల్లాలోని థర్యాల్ గ్రామంలో డాబా మీద నిద్రిస్తోన్న రైనా మేనత్త కుటుంబంపై దారుణ దాడి జరిగింది. ఈ దాడిలో రైనా మేనత్త భర్త అశోక్ కుమార్ అక్కడే తుదిశ్వాస విడిచారు. వారి కొడుకు కౌశ‌ల్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించ‌గా, మేన‌త్త ఆశారాణి ఇంకా ఆసుప‌త్రిలో ప్రాణాల‌తో పోరాటం చేస్తుంది. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే దుబాయ్ లో ఐపీఎల్ ఆడేందుకు వెళ్లిన రైనా హుటాహుటిన ఇండియాకు తిరిగొచ్చాడు. త‌న కుటుంబానికి జ‌రిగిన దాడిలో దోషుల‌ను గుర్తించి శిక్షించాల‌ని పంజాబ్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఇక ఈ దాడి పై సిట్ ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వం .. పఠాన్‌కోట్ రైల్వే స్టేషన్ సమీపంలోని చిన్న గుడిసెల్లో నివ‌సించే వారు దాడి చేసిన‌ట్లు గుర్తించారు.

అలాగే , ఈ కేసులో ఇప్పటికే ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి ద‌గ్గ‌ర నుండి దొంగిలించిన బంగారు ఉంగరం, మహిళలు ధరించే బంగారు గొలుసు, ఉంగరం, 1530రూపాయ‌లు, రెండు కర్రలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.మూడు నాలుగు రోజుల పాటు ప‌ఠాన్ కోట్ గురించి బాగా తెలిసిన వారితో క‌లిసి రెక్కీ నిర్వ‌హించామ‌ని, టెర్ర‌స్ మీద వారు ప‌డుకున్న‌ది చూసి క‌ర్ర‌ల‌తో త‌ల‌ల‌పై బాది చంపేశామ‌ని నిందితులు ఒప్పుకున్నారు. ఆ త‌ర్వాత బంగారం, డ‌బ్బు తీసుకొని, పారిపోయామ‌ని, అవ‌న్నీ పంచుకున్నాక మ‌ళ్లీ ఒక‌ర్ని ఒక‌రం క‌లుసుకోలేద‌ని నిందితులు నేరం ఒప్పుకున్నారని పోలీసులు ప్ర‌క‌టించారు.
Tags:    

Similar News