సమస్యలు దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ.. వాటిపై స్పందించే విషయంలోనే తేడాలు ఉంటాయి. రైతుల సమస్యలు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉంటాయి. కాకపోతే.. దక్షిణాదిలో వరిరైతు సమస్య ఉంటే.. ఉత్తరభారతంలో గోధుమ రైతుకు ఇబ్బందులు ఉండొచ్చు.
ఏపీలోని టమోటా రైతులు గిట్టుబాటు ధరలు లేక.. ఒక్కోసారి పంటను పొలాల్లోనే వదిలేస్తారు. తెలుగువారికి ఈ వ్యవహారం సుపరిచితం. టమోటా రైతులు నష్టపోవటం కూడా సాధారణంగా మారింది. దీనికి ఏపీ సర్కారు ఇప్పటివరకూ తీసుకున్న చర్యలు పెద్దగా లేవు.
దాదాపుగా ఇలాంటి సమస్యే పంజాబ్‌లో చోటు చేసుకుంది. అక్కడ బంగాళదుంపలు భారీగా పండిస్తారు. గతంతో పోలిస్తే ఈసారి ఆలూ భారీగా పండాయి. దాదాపు 22 లక్షల టన్నుల ఆలుగడ్డలు పండటంతో అక్కడ వాటి రేటు పడిపోయింది.
గతంలో కింట్వాలు ఆలూ ధర రూ.వెయ్యి ఉంటే.. ఇప్పుడు అది కాస్తా రూ.200 పడిపోయింది. దీంతో.. బంగాళదుంప రైతులు తీవ్ర అవస్థలకు గురి అవుతున్నారు. దీంతో.. ఆ రాష్ట్ర సర్కారు ఈ అంశం మీద స్పందించింది. ప్రభుత్వ పథకాల్లో బంగాళదుంపల వినియోగం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. పిల్లల మధ్యాహ్న భోజనంలో బంగాళదుంపను వినియోగించాలని నిర్ణయించారు.
అంతేకాదు.. మార్క్‌ఫెడ్ ద్వారా బంగాళదుంపల్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. టమోటా రైతుల్ని కనుక ఏపీ సర్కారు వదిలేసినట్లు కాకుండా.. పంజాబ్ సర్కారు ఆలూ రైతుల్ని ఎలా పట్టించుకుందో గుర్తించాల్సిన అవసరం ఉంది. వారిని ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన స్పందించిన రీతిలో.. ఏపీ సర్కారు కూడా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది.