బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు - కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి ఏపీ సీఎం జగన్ - ప్రతిపక్షనేత చంద్రబాబు పై నిప్పులు చెరిగారు. బీజేపీ పై తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. నిధుల కేటాయింపు వివరాలు చెప్పకుండా కేంద్రం నిధులివ్వడం లేదంటూ నిరాధార ఆరోపణలతో చాలా మంది నాయకులు మీడియాలో మాట్లాడుతున్నారని, ఆధారాలు లేకుండా కేంద్రం పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
కేంద్రం గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో అనేక పథకాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్ల రాష్ట్రం ఇలా తయారైంది అని, దీనితో ప్రభుత్వ అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నిందలు వేస్తుందని పురందేశ్వరి మండిపడ్డారు. నెల్లూరులో మంగళవారం పర్యటించిన పురంధరేశ్వరి ప్రభుత్వం పై ఈ విధంగా విరుచుకుపడ్డారు. పోలవరం పనులు సక్రమంగా సాగడం లేదని - దానికి కారణం జగన్ ప్రభుత్వ విధానాలేనని - మూడు రాజధానుల నిర్ణయం వల్ల ఏపీకి నష్టం కలిగిందని పురందేశ్వరి ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైందని - కూలీల జీవితాలు వీధినపడ్డాయని అన్నారు. అలాగే మూడు రాజధానుల నిర్మాణం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోతున్నాయని ఆరోపణలు చేసారు.
ఇక మండలి రద్దు గురించి మాట్లాడుతూ ...మండలి రద్దు చేయకూడదంటూ ఇపుడు నానా యాగీ చేస్తున్న చంద్రబాబు గతంలో రద్దు చేయాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఏపీలో టీడీపీ - వైసీపీ లు రెండు పార్టీలు కూడా స్వలాభం కోసమే పని చేస్తున్నాయని - రెండు పార్టీల విధానాలను ప్రజలు ఇష్టపడటం లేదని - బీజేపీలో ధృడమైన నాయకత్వం ఉండి - గట్టి నిర్ణయాలు తీసుకోవడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. అలాగే ఏపీలో టీడీపీ తో కానీ - వైసీపీతో కానీ పొత్తు ఉండదు అని , జనసేన తో పొత్తు ఉంటుంది అని , జనసేన తో కలిసి పనిచేస్తామని తెలిపారు.