ఏపీకి ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు కారణంగా మరోమారు మిత్రపక్షమైన టీడీపీ, బీజేపీల మధ్య మరోమారు మాటల యుద్ధం మొదలైంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ సర్కారు తీరును తప్పుపట్టే బీజేపీ సీనియర్ నేత పురందీశ్వరి తాజాగా మళ్లీ చంద్రబాబు తీరును తప్పుపట్టారు. దీనికి అదే రీతిలో టీడీపీ కూడా రియాక్టయింది. కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తోందనడం సరికాదని, పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నవి తప్పుడు లెక్కలు అని పురందీశ్వరి తప్పుపట్టారు. ప్రతిపక్షమా.. మిత్రపక్షమా.. అనేది ముఖ్యం కాదని, సరైన లెక్కలు పంపితే తక్షణమే కేంద్రం నిధులు ఇస్తుందని ఆమె తెలిపారు.
ఇదిలాఉండగా... కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందీశ్వరి పోలవరం ప్రాజెక్టు విషయంలో చేసిన కామెంట్లను మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు తప్పుపట్టారు. ప్రాజెక్టు నిర్మించే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సామర్థ్యం గురించి పురందీశ్వరి కితాబు ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వచ్చి పోలవరం పనులు బాగా జరుగుతున్నాయని అభినందించారని అన్నారు. 14వ తేదీన చంద్రబాబునాయుడు గడ్కరీని ఢిల్లీలో కలిసినప్పుడు ఒక తమ్ముడిగా పోలవరం పూర్తి చేయడానికి చంద్రబాబుకు పూర్తి సహకారం అందిస్తానని, కేంద్రం, రాష్ట్రం ఒక జట్టుగా కలిసి పనిచేసి పోలవరం పూర్తి చేస్తాయని గడ్కరీ చెప్పిన మాటలు పురందీశ్వరి గుర్తుంచుకోవాలన్నారు.
రాష్ట ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్కను నిర్మించే సామర్థ్యం ఉందని నీతిఆయోగ్ సూచించిందని కంభంపాటి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 10సంవత్సరాలలో రూ. 5వేల కోట్లు పోలవరం ప్రాజెక్టుపై ఖర్చు చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం మూడున్నర సంవత్సరాల కాలంలోనే సంవత్సరానికి రూ.2500కోట్ల చొప్పున రూ.8వేల కోట్ల ఖర్చు చేసిందని తెలిపారు. ఇప్పటికే 90శాతం మట్టిపని, 50శాతానికి పైగా కాంక్రీట్ పనిని పూర్తి చేయడం జరిగింది. ఈ పని పరంధేశ్వరికి కనబడటం లేదా? అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా పురందీశ్వరిపై కంభంపాటి ప్రశ్నల వర్షం కురిపించారు. `180రోజులలో సచివాలయాన్ని పూర్తి చేసుకొని ఆంధ్రప్రదేశ్‌లో పాలనను సమర్థవంతంగా చేస్తుండడం కనపడటం లేదా? 1100 కాల్ సెంటర్ ను ప్రారంభించి ప్రజల సమస్యలపై ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందిస్తుండటం కనపడటం లేదా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నారైతు రుణమాఫీ చేయడం కనబడలేదా? ఉపాధిహామీ నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగిస్తుండటం కనపడటం లేదా? ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందుంది. ఈ గ్రిడ్ పై ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి స్టడీ చేయాలని ఇతర ప్రభుత్వాలకు స్వయంగా ప్రధానమంత్రి మోడీనే సూచించిన సంగతి పరందేశ్వరికి తెలియదా? పురందీశ్వరి ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి ఆలోచనలోనే ఉన్నారా? సమాధానం చెప్పాలి. కేంద్రమంత్రికి లేని అనుమానాలు పరందేశ్వరికి ఏవిధంగా వస్తున్నాయో చెప్పాలి` అంటూ ప్రశ్నలు గుప్పించారు.