పురంధేశ్వరి కామెంట్లు చంద్రబాబుపైనేనా?

Update: 2017-05-22 05:56 GMT
    వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు జిల్లా పత్తికొండ ఇన్‌చార్జి నారాయణరెడ్డి హత్య నేపథ్యంలో బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు మిత్రపక్షం టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును ఇరుకునపెడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న కేఈ కృష్ణమూర్తి తనయుడు ఈ హత్య చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో పురంధేశ్వరి వ్యాఖ్యలు టీడీపీకి షాక్ ఇచ్చాయి. కర్నూలులో మళ్లీ ఫ్యాక్షనిజం మొదలుపెడుతున్నారని ఆమె అనడంతో ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియని స్థితిలో టీడీపీ నేతలు కామ్ గా ఉండిపోయారు.

    వైసీపీ నేత నారాయణ రెడ్డి హత్య అత్యంత దురదృష్ట కరమని  పురంధేశ్వరి అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్యతో భేటీ అయిన తరువాత ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో సమసిపోయిందనుకున్న ఫ్యాక్షనిజాన్ని మళ్లీ తెర మీదకు తీసుకురావడం విచారకరమన్నారు.
    కాగా... పురంధేశ్వరి టీడీపీ, చంద్రబాబును ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. హత్య పూర్తిగా రాజకీయ కక్షలతో చేసినట్లుగా తెలుస్తుండడం... దీని వెనుక టీడీపీ కీలక నేత పేరు వినిపిస్తుండడంతో ఆమె వ్యాఖ్యలు టార్గెట్ టీడీపీ అని అర్థమైపోతోంది. అయితే... మిగతా బీజేపీ నేతలెవరూ దీనిపై పెద్దగా స్పందించలేదు.
Tags:    

Similar News