ప్రతిదానికి లక్ష్మణ రేఖ అంటూ ఒకటి ఉంటుంది. దాన్ని వీలైనంత వరకూ దాటకుండా ఉండటం మంచిది. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అలాంటివి అస్సలు పట్టించుకోరు. తన రాజకీయ ప్రయోజనాల కోసం దేనికైనా ఆయన సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఇటీవల జగన్ పార్టీలో చేరేందుకు దగ్గుపాటి వెంకటేశ్వరరావు.. ఆయన కుమారుడు హితేశ్ లు కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతను కలిశారు.
అంతే.. నాటి నుంచి దగ్గుబాటిపైనా.. ఆయన కుటుంబ సభ్యుల మీద విమర్శలు చేయటం మొదలెట్టారు చంద్రబాబు. ఎవరికి నచ్చిన పార్టీలో చేరే హక్కు వారికి ఉంటుంది. ఆ విషయాన్ని వదిలేసి.. దగ్గుబాటి అన్ని పార్టీల్లో చేరతారని.. ఆయన చేరని పార్టీ లేదంటూ చులకన చేసేలా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన దగ్గుబాటి పురందేశ్వరి మీద విమర్శలు చేశారు.
తన భార్య సోదరి అయిన పురంధేశ్వరి గురించి చంద్రబాబు లాంటి నేత రాజకీయంగా విమర్శలు చేయటం సరికాదన్న వాదన వినిపించింది. నిజంగానే దగ్గుబాటి కుటుంబం తప్పు చేసి ఉంటే.. ఆ విషయాన్ని తమ తీర్పు ద్వారా ప్రజలు చెప్పేస్తారు. అలాంటప్పుడు అవసరం లేకున్నా ఫ్యామిలీ మ్యాటర్స్ ను .. సున్నితమైన విషయాల్ని బాబు ప్రస్తావించటంపై దగ్గుబాటి వర్గీయులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
జగన్ ను కలిసిన దగ్గుబాటిపైన సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారం.. ట్రోలింగ్ ను చిన్నమ్మ తప్పు పట్టారు. తాజాగా ఆమె.. సోషల్ మీడియాలో ఒక ప్రకటనను విడుదల చేశారు. తన భర్త.. కుమారుడు జగన్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించినంతనే వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేయటంపై చిన్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసిన ఆమె.. ఎప్పుడూ లేని విధంగా తన వ్యక్తిగత విషయాల్ని.. బాధల్ని పంచుకున్నారు.
స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది సున్నితమైన వ్యక్తిగత విషయాల్ని రాజకీయం చేస్తున్నట్లు చెప్పిన చిన్నమ్మ.. తాను ఇద్దరు బిడ్డల్ని కోల్పోయిన విషయం వాళ్లకు తెలుసా? అని ప్రశ్నించారు. తన కుమార్తె కంటే ముందు ఒకరిని.. తన కుమారుడుకు ముందు మరొకరిని కోల్పోయానని.. ప్రత్యేక వైద్యం నిమిత్తం అమెరికాకు వెళ్లిన విషయం తెలుసా? అని ప్రశ్నించారు.
తన తండ్రి ఎన్టీఆర్ బలవంతంగా అమెరికా పంపిన విషయం తెలుసా? అన్న ప్రశ్నను సంధించిన పురందేశ్వరి.. తనను టార్గెట్ చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తాను చెప్పాల్సిందేమీ లేదని ఆమె స్పష్టం చేశారు. మళ్లీ తాము రాజకీయాల్లోకి వద్దామనుకున్నప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును టీడీపీ తిరస్కరించిన విషయం గురించి ఎవరికైనా తెలుసా? అని ఆమె ప్రశ్నించారు.
2014లో తనకు బీజేపీ టికెట్ దక్కకుండా చేసేందుకు టీడీపీ కుట్ర పన్నిన విషయం ఎవరికైనా తెలుసా? అని నిలదీసిన ఆమె.. తాను రాజకీయాలకు అతీతంగా కుటుంబాన్ని ప్రేమిస్తానని చెప్పారు. తాను ఏ సందర్భంలోనూ వ్యక్తిగతంగా విమర్శించిన సందర్బాలు లేవని.. దయచేసి తన పిల్లలు.. కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత అంశాల జోలికి పోవద్దని సూచన చేశారు. చిన్నమ్మ ఆవేదనతో అయినా.. అనవసరమైన విషయాల మీద తెలుగు తమ్ముళ్ల ఫోకస్ తగ్గిస్తారో లేదో చూడాలి.