అనుకున్నంత పని మొదలైంది. ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసే మరో యుద్ధం మొదలైంది. కారణం ఏమైనా కానీ.. ఎవరికి కొరుకుడుపడని పుతిన్ పుణ్యమా అని.. రష్యా నేరుగా యుద్దానికి దిగింది. ఒకప్పుడు తమలో భాగమైన ఉక్రెయిన్ మీద ఉన్న పేచీతో.. ఎలాగైనా ఉక్రెయిన్ కు తన బలాన్ని చూపించి.. తాము కన్నేసింది కబళించాలన్న లక్ష్యంతో రష్యా తన యుద్ధాన్ని షురూ చేసింది.
తాజాగా యుద్ధానికి తెర తీసిన రష్యా.. తమ దాడిలో భాగంగా ఉక్రెయిన్ లోకి రష్యా సైన్యం ప్రవేశించింది. ఆ దేశ రాజధాని కీవ్ నగరంపై రష్యా బాంబుల వర్షాన్ని కురిపించింది. ఉక్రెయిన్ పైన మిలటరీ ఆపరేషన్ మొదలైందని రష్యా అధినేత వాద్లిమర్ పుతిన్ ప్రకటించారు. ఇప్పటికే ఆయన ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతానని చెప్పటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ మీద మిలటరీ చర్యకు ఆదేశాలు జారీ చేసిన పుతిన్.. పనిలో పనిగా ప్రపంచానికి పెద్ద వార్నింగ్ ఇచ్చేశారు.
రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో బయటి దేశాలు జోక్యం చేసుకోవాలని చూస్తే.. చరిత్రలో మునుపెన్నడూ ఎదురుకాని తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ‘మీరు నా మాట వింటారని ఆశిస్తున్నా’ అంటూ ఆయన ప్రపంచ దేశాలకు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. తమ ఉద్దేశం ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవటం ఏ మాత్రం కాదంటూనే.. సైనిక చర్యకు ఓకే చెప్పటం గమనార్హం.
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ లో అత్యవసర పరిస్థితిని విధించారు. రష్యాకు ధీటుగా బదులు చెప్పేందుకు ఉక్రెయిన్ తన బలగాల్ని సిద్ధం చేసుకుంది. రష్యా దాడి నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటామని ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. రష్యా బాంబు దాడులతో కైవ్.. ఖార్కివ్ నగరాల్లో భారీ ఎత్తున పేలుళ్ల శబ్ధాలు వినిపిస్తున్నట్లుగా మీడియా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.
ఉక్రెయిన్ నుంచి వస్తున్న బెదిరింపులకు ప్రతిస్పందనగా తామీ మిలటరీ చర్యను చేపట్టినట్లుగా పుతిన్ చెబుతున్నారు. తమ పొరుగు దేశాన్ని ఆక్రమించాలన్న లక్ష్యం తమది కాదంటున్న ఆయన.. ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె నుంచి దింపి.. తనకు అనుకూలంగా ఉండే నేతలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే పుతిన్ ఆలోచనగా చెబుతున్నారు. తాజాగా రష్యా జరుపుతున్న బాంబు దాడులతో తూర్పు ఉక్రెయిన్ ప్రాంతం దద్దరిల్లుతోంది. ఉక్రెయిన్ లోని డాన్ బాస్ ప్రాంతంలో ప్రత్యేక సైనిక చర్య నిర్వహించటానికి రష్యన్ సైనిక దళాలకు తాము అధికారం ఇచ్చినట్లుగా పుతిన్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. తాజా పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్ రాయబారి సెర్గీ కిస్లిట్యా స్పందించారు. తాజా పరిణామాల్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ నాయతక్వం నుంచి రష్యా తప్పుకోవాలని డిమాండ్ చేస్తూనే.. యుద్ధాన్ని ఆపేందుకు ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశపర్చాలని కోరారు. ఉద్రిక్తతల గురించి చర్చించే సమయం మించిపోయిందని.. ఇప్పుడు యుద్ధాన్ని ఆపే అన్ని మార్గాల్ని చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.