జెలెన్ స్కీతో పుతిన్ కూతురు ప్రేమాయణం..? తాజాగా వెలుగులోకి..

Update: 2022-05-23 04:07 GMT
రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ పై అనుకూల చర్యలు ప్రారంభించడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘యూరోపియిన్ వాతావరణం బాగా ఇష్టపడుతున్నట్లున్నారు.. అందుకే ఎక్కువ ప్రయాణాలు చేస్తున్నారు.

ఇక్కడి ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు..’ అని ఆయన రష్యా నుంచి ప్రయాణం చేసిన వారిని ఉద్దేశించి ఇటీవల అన్నారు. అయితే రష్యా నుంచి యూరోప్ కు ఎక్కువగా  ప్రయాణించిన వారిలో ఆయన కూతురు కేథరీనా కూడా ఉంది. 2017 నుంచి 2019 మధ్య కాలంలో కేథరీనా రష్యా నుంచి జర్మనీకి 50 సార్లు ప్రయాణించినట్లు తాజాగా వెల్లడైంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే ఆయన కూతురు జెలెన్ స్కీ కోసం ప్రయాణించిందట. ఇంతకీ స్టోరీ ఏంటంటే..?

జర్మనీ మేగజైన్ డేర్ స్పైజెల్ ఉమ్మడిగా నిర్వహించిన ఆపరేషనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంస్థలు సేకరించిన డాటా ప్రకారం రష్యా అధ్యక్షుడు పుతిన్ చిన్న కూతురు కేథరీనా రెండేళ్ల కాలంలో రష్యా నుంచి జర్మనీకి 50 సార్లు ఫ్లైట్ ఎక్కారు.

రష్యా ప్రభుత్వ అధికారుల ప్రోత్సాహంతోనే ఆమె జర్మనీకి వెళ్లినట్లు సమాచారం. అయితే ఆమె ప్రయాణ టిక్కెట్లలో  ఓ చిన్న పాప పేరు కూడా ఉంది. అమె ఎవరో కాదు కేథరీనా గారాల పట్టి. రెండేళ్ల వయసున్న ఈ పాప పాస్ పోర్టు కేథరీనాతో సంబంధాలు కలిగి ఉన్నాయి. ఈ పాప తండ్రి సంరక్షుడిగా  జెలెన్ స్కీ అని బయటపడింది.

జర్మనీకి చెందిన మ్యూనిచ్ స్టేట్ బ్యాలెట్ మాజీ డైరెక్టర్ ఇగోర్ జెలెన్ స్కీ సంరక్షుడిగా..కేథరినీ పాప పాస్ పోర్టులో ఉండడంతో.. వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇగోర్ జెలెన్ స్కీ ప్రముఖ డ్యాన్సర్. ఈయనకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది.

2016లో జర్మనీ బయెరిస్కెస్ స్టాట్స్  బ్యాలెట్ కు అర్టిస్టిక్ డైరెక్టర్ గా నియామకమయ్యాడు. కానీ గత ఏప్రిల్ 4న  ఈ పదవి నుంచి తప్పుకున్నాడు. ఇగోర్ జెలెన్ స్కీ పుతిన్ కు సపోర్టు గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఉక్రెయిన్ పై పుతిన్ తీసుకుంటున్న చర్యలపై ఇగోర్ జెలెన్ స్కీ ఏ విధంగా స్పందించలేదు. అంతేకాకుండా రష్యా నేషనల్ కల్చరల్ హెరిటేజ్ ఫౌండేషన్ బోర్డ్ లో ఈయన పర్యవేక్షకుడిగా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో పుతిన్ కుమార్తెతో ఆయన సంబంధాలు కలిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

 అయితే కేథరీనా టిఖోనోవా గతంలో కిరిల్ షమలోవ్ ను పెళ్లి చేసుకున్నారు. 2018లో వీరు విడిపోయారు. 2017లో వీరికి ఓ పాప జన్మించింది. ప్రస్తుతం ఆ పాప సంరక్షుడి పేరు ఇగోరెవ్నాగా ఉంది. అంటే అది ఇగోర్ జెలెన్ స్కీనే కావొచ్చని అంటున్నారు. అయితే ఈ విషయంపై కేథరినా ఇప్పటి వరకు స్పందించలేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమినర్ జెలెన్ స్కీతో కేథరిన్ కు ఎలాంటి సంబంధం లేదు. కానీ కేథరిన్ ప్రేమాయణం సాగించిన వ్యక్తి పేరు కూడా జెలెన్ స్కీ కావడం చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News