పుతిన్ ఎఫెక్ట్ .. అఖండ భారతంపై కొత్త చర్చ... ?

Update: 2022-02-26 05:28 GMT
నిజానికి శాంతి శాంతి అంటూ భారత్ ఈ రోజు దక్షిణాసియాలో తన భౌగోళిక స్వరూపాన్ని స్వభావాన్ని కూడా మెల్లగా ఒక్కోటిగా  కోల్పోతూ వస్తోంది. ట్రాజడీ ఏంటి అంటే చిన్న దేశాలు కూడా భారత్ ని విమర్శించడం. నిజానికి  భారత్ అఖండమైన దేశం. ఒకనాడు భారత్ అంటే ఈ రోజు ఉన్న నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటివి అన్నీ కూడా అందులో భాగమే. మరి కొన్ని శతాబ్దాల క్రితం దాకా అలాగే భారత్ ఉండేది.

పాకిస్థాన్,  బంగ్లాదేశ్, బర్మా, టిబెట్, ఆఫ్గనిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్ లను కలిపి అఖండ భారత్ అంటారు. ఒక విధంగా చెప్పాలీ అంటే అంటే బ్రిటిష్ కు ముందున్న భారతదేశం ఇది.  ఇంకా ముందు కాలం లోకి వెళ్తే చాలా ముస్లిం దేశాలన్నీ భారత్ లో అంతర్భాగమే. అయితే ఆధునిక చరిత్రను తీసుకుంటే మాత్రం ఈ దేశాలు ఒక్కోటిగా భారత్ నుంచి విడిపోయాయి అని చెప్పుకోవాలి.

అలా  బ్రిటీష్ వాళ్ళు విశాల దేశాన్ని పాలించి, కొన్ని దేశాలుగా చీల్చి స్వతంత్రం ఇచ్చి పోయారు.మరో వైపు చూస్తే విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్, దుర్గావాహిని మొదలైన సంస్థ‌లు నేటికీ అఖండ భారత్ సాధించాలని డిమాండ్ చేస్తూ ఉంటాయి. మన పురాణాల్లో ఉన్న అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన సరస్వతి పీఠం పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాదుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని, అలాగే వేదాలు పుట్టిన సింధూ నదీప్రాంత పవిత్రభూమి కూడా పాకిస్థాన్ లోనే ఉందని చెబుతారు.

మరి అలాంటి భారతదేశం బ్రిటిష్ వారి కుట్ర కారణంగా ముక్కలుగా విభజించబడింది. కానీ బ్రిటిష్ వారి దుర్నీతి వల్ల 18వ శతాబ్దం మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ ని, అలాగే నేపాల్ ని కోల్పోయిన భారత్  19వ శతాబ్దంలో ఏకంగా పాకిస్థాన్ని కూడా కోల్పోయింది. బంగ్లాదేశ్ పాక్ నుంచి 1971లో వేరు పడింది. ఇపుడు భారత్ మీద పాకిస్థాన్ పరోక్ష యుద్ధమే చేస్తోంది.

కాశ్మీరు ని సమస్యగా చూపించి భారత్ మీద వేయ్యేళ్ళ యుద్ధం చేస్తాను అంటోంది. ఒక విధంగా చూస్తే ఉక్రెయిన్ కి పాకిస్థాన్ కి కూడా పోలికలు ఉన్నాయని చెప్పాలి. ఉక్రెయిన్ నాటో దేశాలతో కలుస్తాను అని అంటేనే తమ దేశానికి అది ఫ్యూచర్ లో ముప్పు అని భావించి రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అతి పెద్ద యుద్ధం చేసి ఉక్రెయిన్ ని కలుపుకోవాలని చూస్తున్నాడు.

మరి భారత్ తో శతాబ్దాలుగా ఉంటూ కేవలం ఏడున్నర పదుల ఏళ్ల నుంచే వేరుపడిన పాకిస్థాన్ని భారత్ ఎందుకు తిరిగి కలుపుకోకూడదు అన్న కొత్త చర్చ కూడా వస్తోంది. పాక్ సైతం భారత్ ని ఇబ్బంది పెట్టడానికి సరిహద్దులలో చైనాకు చోటిస్తోంది. ఆ విధంగా భారత్ కి నిరంతర ముప్పు తెచ్చేలా ప్రయంతాలు చేస్తోంది. అదే విధంగా  భారత్ ని దెబ్బ తీయడానికి  అతి పెద్ద వ్యూహమే పన్నుతోంది.

మరి తన దేశానికి ముప్పు అన్న ఒకే ఒక సాకుతో ఉక్రెయిన్ పని పడుతున్న రష్యాకు ఉన్న తెగువ భారత్ కి కూడా ఉండాలి కదా అన్న చర్చ కూడా వస్తోంది. అదే విధంగా నేపాల్ ని మచ్చిక చేసుకుని భూటాన్ని బెదరగొట్టి చైనా భారత్ పొలిమేరల దాకా వచ్చేస్తోంది. మరి ఆ రెండు దేశాలను కలుపుకుంటే  ఈ ముప్పు శాశ్వతంగా తొలగిపోతుంది కదా అన్న చర్చ కూడా వస్తోంది.

పుతిన్ చేసింది తప్పు అని ప్రపంచం అంటూంటే తమ దేశం కోసం తాను చేస్తోంది రైటు అని పుతిన్ అంటున్నాడు. మరి ప్రపంచం కూడా అలాగే చూస్తూ ఉండిపోతోంది. భారత్ కూడా తన దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అఖండ భారతాన్ని తిరిగి సాధించేందుకు ఎందుకు ప్రయత్నం చేయకూడదు అన్న ప్రశ్న వస్తోంది. పాత సోవియట్ యూనియన్ కోసం పుతిన్ చేస్తున్న అడుగులు ప్రయత్నాలు ఒక వైపు విమర్శల పాలు అవుతున్నా ఆ దేశం తగ్గడంలేదు. మరి భారత్ ఎందుకు తన భూభాగాలను కోల్పోయి చేతులు ముడుచుకుని కూర్చోవాలీ అన్న మాటా వస్తోంది.

నిరంతరం దాయాదుల పోరుతో, దేశంలో ఉగ్రవాద దాడుతో, ఇబ్బందులతో  భారత్ ఏడున్నర పదులుగా నానా అవస్థలు పడుతోంది.  మరి భారత్ తన దేశ రక్షణ కోసం రేపటి రోజున తన పాత దేశాలను విలీనం చేసుకుంటే తప్పేంటి అన్న చర్చ అయితే కొత్తగా వస్తోంది. చూడాలి మరి ఇది ఎంత మేరకు విస్తృతమవుతుందో. దీని ప్రభావం ఎలా ఉంటుందో పుతిన్ ఎఫెక్ట్ తో అఖండ భారతం డిమాండ్ ఇంకా ఎంతలా సౌండ్ చేస్తుందో కూడా చూడాలి.
Tags:    

Similar News