రష్యా అధినేత వాద్లిమర్ పుతిన్ విషయంలో ప్రాశ్చాత్య మీడియా ఎప్పుడూ నెగిటివ్ గానే ఆయన్ను చూపిస్తుందన్న విమర్శ ఉంది. ఆయన ఆరోగ్యం బాగోలేదని.. ఆయన పరిస్థితి విషమంగా ఉందన్న మాటల్ని చెబుతూ ఉంటుంది. తనకు సంబంధించిన వివరాల్నిచాలావరకు సీక్రెట్ గా ఉంచే పుతిన్.. ఇలాంటి వాదనలకు మరింత బలం చేకూరేలా ఆయన తీరు ఉంటుందని చెబుతున్నారు. తాజాగా పుతిన్ కు సంబంధించిన ఆసక్తికర కోణం బయటకు వచ్చింది. పుతిన్ ఒకరుకాదని.. ఇద్దరుగా అభివర్ణిస్తున్నారు.
పుతిన్ ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేని నేపథ్యంలో ఆయన మాదిరే ఉండే మరో వ్యక్తిని పుతిన్ ప్లేస్ లో ఉంచి.. రోజువారీ అధికార కార్యక్రమాల్లాలోనూ.. విదేశీ పర్యటనలకు పంపుతున్నారన్న వాదన అంతకంతకూ ఎక్కువ అవుతోంది. 69 ఏళ్ల పుతిన్ తనకు బాడీ డబుల్ ను తెర మీదకు తెచ్చినట్లుగా ప్రాశ్చాత్య మీడియా ప్రత్యేక కథనాల్ని ప్రచురిస్తోంది.
తన వాదనకు బలం చేకూరేలా కొన్ని అంశాల్ని హైలెట్ చేస్తోంది. దీనిపై రష్యా ఇప్పటివరకు రియాక్టు అయ్యింది లేదు. ఎలాంటి వివరణను ఇవ్వటం లేదు. డబుల్ బాడీని తెర మీదకు తీసుకురావటానికి కారణం.. ప్రస్తుతం పుతిన్ రోజువారీ ఆరోగ్య చెకప్ లకు ఆసుపత్రులకు వెళ్లాల్సి రావటంతో.. ఈ డబుల్ బాడీ కథనాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.
పుతిన్ ప్రస్తుతం డబుల్ బాడీని ఉపయోగిస్తున్నట్లుగా ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ కైర్య్ లో బుడానోవ్ వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన వాదనలో నిజం ఉన్నట్లుగా ప్రాశ్చాత్య మీడియాప్రచురిస్తున్న కథనాలు ఈ ఇష్యూ మరింత పాపులర్ అయ్యేలా చేస్తోంది. ఇటీవల ఇరాన్ పర్యటనకు వెళ్లిన పుతిన్.. ఒరిజినల్ కాదని.. బాడీ డబుల్ గా అభివర్ణిస్తున్నారు. ఆయన ఎత్తు.. బరువు.. చెవుల వెనుక భాగంలో తేడాల్ని ఇట్టే గుర్తించొచ్చన్న మాట వినిపిస్తోంది.
మనిషి చేతి వేళ్ల మాదిరే.. చెవుల భాగం ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడు బయట ప్రపంచానికి కనిపిస్తున్న పుతిన్ లో ఆ తేడాల్ని గుర్తించొచ్చన్న మాట వినిపిస్తోంది.
పుతిన్ బాడీ డబుల్ వాదనలు ఇదే తొలిసారి కాదు. 2018లోనూ పుతిన్ మాదిరి ముగ్గురు ఉన్నట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థ కథనాల్ని ప్రచురించింది. అయితే.. ఈసారి ఇరాన్ కు వచ్చిన పుతిన్ మాత్రం.. ఒరిజినల్ గా ఉండే పుతిన్ కు సంబంధం లేనట్లుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఏమైనా ఈ అంశంపై మరింత క్లారిటీ రావటానికి మరికొద్ది కాలం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Full View