చేతిలో అధికారం ఉండాలే కానీ దాన్ని బంతాట ఆడుకునే అధినేతలు కొందరే ఉంటారు. అందులో రష్యా దేశాధ్యక్షుడు వాద్లిమర్ పుతిన్ ముందుంటారు. అయ్యగారు ఏ ముహుర్తంలో దేశాధ్యక్షుడు అయ్యాడో కానీ.. అప్పటి నుంచి ఆయనదే అధికారం. ఆయన మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా.. విమర్శలు వచ్చినా.. అధికారంమాత్రం ఆయన చేతుల్లోనే. ఎవరైనా నేతకు దేశంలో ఆదరణ పెరుగుతుంటే చాలు.. పుతిన వర్గం అలెర్టు అయిపోతుంది. సదరు నేత జైలుపాలు కావాల్సిందే.
ఇలా తనకు అడ్డు వచ్చే వారిని ఏ మాత్రం విడిచి పెట్టని పుతిన్.. తాజాగా తనను 2036 వరకుదేశాధ్యక్షుడి స్థానంలో ఉండేందుకు వీలుగా ఒక బిల్లును తాజాగా ఆమోదించారు. ప్రస్తుతం ఆయన పదవీ కాలం 2024తో ముగుస్తుంది. దీనికి మూడేళ్ల ముందే మేల్కొన్న పుతిన్.. వచ్చే రెండు దఫాలుగా కూడా పుతినే దేశాధ్యక్షుడిగా ఉండాలని పేర్కొంటూ స్టేట్ డ్యూమా (దేశ దిగువసభ) ఆమోదం పలికింది.
అనంతరం ఈ బిల్లును రష్యా ఎగువ సభ ఆమోదం కోసం పంపుతారు. అక్కడ కూడా ఎలాంటి అడ్డు ఉండదు. ఆ సభలోనూ ఆమోద ముద్ర పడిన తర్వాత దేశాధ్యక్షుడి ముందుకు వెళుతుంది. దానిపై ఆయన సంతకం పెట్టిన తర్వాత నుంచి అమల్లోకి వచ్చేస్తుంది. ఇదంతా పుతిన కనుసన్నల్లో జరుగుతుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మరో విషయం ఏమంటే.. ఇప్పటికే నాలుగు దఫాలుగా రష్యా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతల్ని చేపట్టిన లెక్కను తాజాగా ఆమోదించిన బిల్లులోకి తీసుకోరు. దీంతో.. 2036 వరకు ఆయనే రష్యా రారాజు. ఇలాంటివి పుతిన్ కు మాత్రమే సాధ్యమవుతాయని చెప్పక తప్పదు.