రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య గడిచిన తొమ్మిది నెలలు యుద్ధం నిరాటకంగా కొనసాగుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీ యుద్ధం నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాలకు చెందిన వేలాది మంది సైనికులతో పాటు సాధారణ పౌరులు ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రస్తుతం యుద్ధం ఇరు దేశాలకు ఆత్మగౌరవ సమస్యగా మారడంతో ఇప్పట్లో యుద్ధం ముగిసేలా కన్పించడం లేదు.
రష్యా-ఉక్రెయిన్ వార్ ను ఆపేందుకు ఐరాస ఎన్ని చేసినా ఫలితం మాత్రం శూన్యంగా మారింది. ఇలాంటి నేపథ్యంలోనే రష్యాపై అమెరికా.. యూరోపియన్ యూనియన్ దేశాలు పలు ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలోనే రష్యా సైతం ఆ దేశాలకు పుతిన్ గట్టి వార్నింగ్ పంపారు. ఉక్రెయిన్-రష్యా వార్ లో ఎవరైనా తల దూరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.దీంతో నాటో దేశాలు నేరుగా యుద్దంలో పాల్గొనకుండా ఉక్రెయిన్ కు పరోక్షంగా ఆయుధాలను సమకూరుస్తూ యుద్ధం కొనసాగేలా చేస్తున్నాయి.
ఉక్రెయిన్-రష్యా మధ్య వార్ ఇప్పట్లో కొలిక్కి వచ్చే పరిస్థితి లేకపోవడంతో అణుయుద్ధం తప్పదనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యాలోని మానవ హక్కుల మండలి వార్షిక సమావేశంలో పుతిన్ అణు యుద్ధం ముప్పుపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ సమావేశంలో వీడియోలో లింకు ద్వారా పాల్గొని పుతిన్ ముందస్తు అణ్వస్త్ర ప్రయోగంపై క్లారిటీ ఇచ్చారు.
ఉక్రెయిన్ తో యుద్ధం సుదీర్ఘ ప్రక్రియ అని తెలిపారు. అణు ముప్పు పెరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇందులో దాచుకోవాల్సింది ఏమీ లేదని తెలిపారు. రష్యా అణ్వస్త్రాలను ముందుగా ప్రయోగించడం గానీ.. వాటిని చూపి బెదిరించడం గానీ చేయదని స్పష్టం చేశారు. అణ్వస్త్ర ప్రయోగం వల్ల ఎంత నష్టం జరుగుతుందో తమకు తెలుసని.. అందుకే ఉన్మాదంగా వాటిని ఉపయోంచబోమని వెల్లడించారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణ్వస్త్రాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. అయితే వాటిని తమ ఆత్మ రక్షణ కోసమే వాడుకుంటున్నామని చెప్పారు. ఇతర దేశాల భూభాగంలో తమ అణ్వస్త్రాలు లేవని అమెరికాను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టర్కీ.. ఇతర ఐరోపా దేశాల్లో అమెరికా తన అణ్వాయుధాలను మోహరించడంపై పుతిన్ తప్పుబట్టారు.
పుతిన్ వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. అణ్వస్త్రాలపై పుతిన్ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రెస్ విమర్శించారు. పుతిన్ బాధ్యతా రహిత్యానికి అణ్వస్త్రాలపై ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని మండిపడ్డారు. ఏది ఏమైనా అణ్వస్త్రాలను రష్యా ముందుగా ప్రయోగించేది లేదని స్పష్టం చేయడంతో మానవ హక్కుల మండలి హర్షం వెలిబుచ్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.