అమెరికాకు రష్యాకు అంతగా సరిపోదు. కానీ.. ఇప్పుడు సీన్ మారింది. అమెరికా అధ్యక్షుడిగా మరో మూడు రోజుల్లో ప్రమాణస్వీకారం చేయనున్న ట్రంప్ పుణ్యమా అని సరికొత్త అనుబంధం ఈ రెండు దేశాల నడుమ ఏర్పడనుంది. నిజానికి ట్రంప్ విజయం వెనుక రష్యా అధినేత పుతిన్ పావులు కదిపినట్లుగా భారీ ఆరోపణే ఉందన్న విషయం తెలిసిందే. ఈ వివాదం ఒక కొలిక్కి రాక ముందే.. అధికారబదిలీకి రంగం సిద్ధమైంది.
ఇదిలా ఉంటే.. ట్రంప్ తో రష్యాకున్న అనుబంధంపై వెల్లువెత్తుతున్న విమర్శలు.. ఆరోపణలపై తాజాగా రష్యా అధినేత పుతిన్ ఘాటుగా స్పందించారు. ఒబామాను నేరుగా తిట్టకున్నా.. ఆయన యంత్రాంగాన్ని దారుణ పదజాలంతో తిట్టేయటం ద్వారా.. తాను తిట్టేదెవరినన్న విషయాన్ని తన మాటతో చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. ట్రంప్ ను కించపరిచేందుకు అమెరికా అధ్యక్షుడు ఒబామా యంత్రాంగం తప్పుడు ఆరోపణలు చేస్తుందన్న పుతిన్.. ఇలాంటి పనులు చేసేవారు.. వేశ్యల కన్నా నీచంగా ఆయన అభివర్ణించారు.
2013లో ట్రంప్ తన రష్యా పర్యటనలో భాగంగా మాస్కో హోటల్ లో బస చేశారు. ఈ సందర్భంగా ఆయన రష్యా వేశ్యలతో గడిపినట్లుగా విడుదలైన డాక్యుమెంట్ నకిలీదన్న పుతిన్.. అలాంటివి సృష్టించేవారు వేశ్యల కన్నా నీచమంటూ మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ట్రంప్ మీద వస్తున్న ఆరోపణల్ని ఈ స్థాయిలో ఖండిస్తూ.. అండగా నిలబడుతున్న పుతిన్ తీరు చూస్తే.. రానున్న రోజుల్లో అమెరికా.. రష్యాల మధ్య అనుబంధం ఎంతవరకూ వెళుతుందన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. వీరిద్దరి చెట్టాపట్టాలతో ప్రపంచంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోనున్నాయో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/