పుతిన్ 'అణు'యుద్ధం చేస్తే ప్రపంచంలో సగం జనాభా ఖతం

Update: 2022-10-18 00:30 GMT
రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ముగియడం లేదు. ఇన్ని నెలలు అయినా కొనసాగుతూనే ఉంది.. ప్రస్తుత పరిస్థితులను చూస్తే పోరు మరింత  తీవ్రమవుతున్నట్లు తెలుస్తోంది. ఏకధాటిగా రష్యా ఉక్రెయిన్ పై దాడికి తెగబడుతుండడం చూస్తే రష్యా యుద్ధాన్ని ముగించినట్లు కనిపించడం లేదు.

తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఉక్రెయిన్ కు మద్దతు ఇస్తున్న పాశ్చాత్య దేశాలపై విరుచుకుపడ్డాడు. అయితే ఖండాతర క్షిపణి ప్రయోగం తరువాత అణుయుద్ధానికి దిగబోతామన్న హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఉక్రెయిన్ ఎంతకు లొంగకపోవడంతో ఆ దేశంపై అణుబాంబు వేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఎలాగైనా విజయం సాధించాలన్న కసితో ఉన్న పుతిన్ అణ్వస్త్ర వినియోగానికి వెనుకాడబోరన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇక ఉక్రెయిన్ పై గెలుపు కోసం రష్యా అణ్వాయుధాలు ప్రయోగిస్తే  నాటో సైనికపరంగా జోక్యం చేసుకోవడం ఖాయమని.. ఫలితంగా పూర్తిస్థాయి అణుయుద్ధం ముంచుకురావచ్చని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. యుద్ధంలో గెలుపు దక్కే అవకాశాలు లేకపోతే పుతిన్ అణ్వాస్త్రాలు బయటకు తీసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక నాటో దేశాలు కూడా అణ్వస్త్ర విన్యాసాలకు సిద్ధమవుతుండడం ఆయనకు ఆగ్రహం కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో అణ్వాయుధాలను వినియోగించడం ఖాయమని వారు  అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ ఉక్రెయిన్ పై రష్యా అణుదాడి చేస్తే మాత్రం అమెరికా, నాటో దేశాలు నేరుగా యుద్ధంలో జోక్యం చేసుకుంటాయి. ప్రతీకార దాడులకు దిగుతాయి. పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయి.ఇక నల్లసముద్రంలో జలాంతర్గామితో అణుబాంబు ప్రయోగిస్తే భారీ సునామీ సృష్టించి ఉక్రెయిన్ లోని 100 కి.మీల దూరంలోని నగరంలోని తుదముట్టించివచ్చని యోచిస్తున్నాడు. దీని వల్ల ఉక్రెయిన్ మాత్రమే కాదు.. చుట్టూ ఉన్న దేశాలకు ముప్పునే.

పుతిన్ అణ్వస్త్ర ప్రయోగాలతో అణుయుద్ధం మొదలైతే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల అణుబాంబుల పేలుడుతో ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది మృత్యువాతపడుతారన్నది అంచనా.. అణుబాంబుల పేలుడుతో ఉత్పన్నమయ్యే వేడి సూర్యుడి ఊపరితలంకంటే ఎక్కువ. సో కిలోమీటర్ల కొద్ది రేడియోధార్మికతతో  దాని ప్రభావంతో మనుషులు ప్రాణాలు కోల్పోతారు. ఈ ధూళి వల్ల ఏళ్ల పాటు భూమిపై  సూర్యరశ్మి పడదు. ఫలితంగా ఉష్ణోగ్రతలు పడిపోయి కరువు తలెత్తుతుంది. 200 కోట్ల మంది వరకూ చనిపోవచ్చు.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News