రష్యా యుద్ధం వెనుక పుతిన్ వ్యూహమిదేనా ?

Update: 2022-02-26 04:47 GMT
మూడురోజులుగా ఉక్రియిన్ పై రష్యా సైన్యం భీకరంగా దాడులు చేస్తోంది. నిజానికి రష్యాతో పోల్చుకుంటే ఉక్రెయిన్ చిట్టెలుకు లాంటిది. అయినా రష్యా యుద్ధానికి దిగటం వెనుక ఉద్దేశ్యమేమిటి ? ఏమిటంటే ఉక్రెయిన్ను తిరిగి రష్యాలోకి కలుపుకునేయటమే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. 1990 ప్రాంతంలో యూఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ సోవియట్ సోషలిష్టు రిపబ్లిక్ విచ్చినమైంది. యూఎస్ఎస్ఆర్ విచ్చినమైన తర్వాత అతిపెద్ద రాష్ట్రాలు దేనికది వేరుపడి 15 దేశాలుగా ప్రకటించుకున్నాయి.

అప్పట్లో స్వతంత్రం ప్రకటించుకున్న దేశాల్లో ఉక్రెయిన్ కూడా ఒకటి. యూఎస్ఎస్ఆర్ విచ్చినమై రష్యా అయ్యింది. అలాంటి రష్యాను పుతిన్ మళ్ళీ యూఎస్ఎస్ఆర్ గా మార్చాలని అనుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. రష్యా యూఎస్ఎస్ఆర్ అవ్వాలంటే మళ్ళీ స్వతంత్రం ప్రకటించుకున్న దేశాలన్నింటినీ తిరిగి రష్యాలో కలుపుకోవాలి. పైగా అప్పట్లో యూఎస్ఎస్ఆర్ ఆధీనంలో ఉండే అణ్వాయుధాలు, అణుకర్మాగారం చెర్నోబిల్ లాంటివి అన్నీ ఉక్రెయిన్లో ఉండిపోయాయి.

ఒప్పందాల ఫలితంగా అణ్యాయుధాలు రష్యా దక్కించుకున్న అణు కర్మాగారాలు, చమురు, గ్యాస్, ఆయిల్ లాంటి అత్యంత విలువైన వేల కోట్ల డాలర్ల సంపదంతా ఉక్రెయిన్లోనే ఉన్నాయి. పైగా ఉక్రెయిన్ను అడ్డుపెట్టుకుని నాటో దేశాలకు నాయకత్వం వహిస్తున్న అమెరికా ఏజెంట్లు రష్యాలోకి వచ్చేస్తున్నారు. వీటన్నింటినీ అడ్డుకోవాలంటే వెంటనే ఉక్రెయిన్ పై యుద్ధంచేయటం, దాన్ని తిరిగి కలిపేసుకోవటమే లక్ష్యంగా పుతిన్ యుద్ధం ప్రకటించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మూడు రోజుల యుద్ధంలో ఉక్రెయిన్ చాలావరకు ధ్వంసం అయిపోయింది. రాజధాని కీవ్ ను రష్యా సైన్యాలు అన్నీ వైపుల నుండి చుట్టుముట్టేశాయి. దేశంలోని కీలక నగరాలు, ప్రాంతాలన్నింటినీ రష్యా సైన్యం  కబ్జా చేసేసింది. ఇక రాజధాని కీవ్ ను కబ్జా చేయటం ఒకటే మిగిలింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఎక్కడో బంకర్లలో దాక్కున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి మరో 24 గంటల్లో కీవ్ కూడా రష్యా సైన్యం చేతికి వచ్చేయటం ఖాయం. కీవ్ ను కబ్జా చేసిన తర్వాత పుతిన్ ఏమి చేస్తారనేది ఆసక్తిగా ఉంది.
Tags:    

Similar News