మారిన కాలానికి తగ్గట్లు కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజా ఉదంతమే ఇందుకు నిదర్శనం. అధికారంలో ఉన్న వారు అనుకోవాలే కానీ ఏమైనా చేయటానికి వెనుకాడటం లేదు. అందుకు నిదర్శనంగా నిలుస్తుంది హైదరాబాద్ లోని ఖైరతాబాద్ క్రాస్ రోడ్స్ నుంచి ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ కు వెళ్లే దారిలోనిలువెత్తు ఇందిరమ్మ విగ్రహం కనిపిస్తుంటుంది. తాజాగా దానికి దగ్గర్లోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా అని.. నిలువెత్తు పీవీ విగ్రహం ఇప్పుడు దర్శనమిస్తోంది.
వీపీ శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాల్ని భారీగా నిర్వహించటం తర్వాత.. పీవీ విగ్రహాన్ని మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. గాంధీల కుటుంబానికి అసలుసిసలు విధేయుడిగా వ్యవహరించే పీవీ కానీ బతికి ఉంటే.. ఇందిరమ్మ విగ్రహానికి మించిన విగ్రహం తనకు ఏర్పాటు చేస్తానని చెప్పి ఉంటే.. అస్సలు ఒప్పుకునే వారు కాదేమో?
సీఎం కేసీఆర్ కు కొన్నినిశ్చితమైన అభిప్రాయాలు ఉంటాయి. దివంగత మాజీ ప్రధాని పీవీని కాంగ్రెస్ నుంచి తమ సొంతం చేసుకునేందుకు గులాబీ బాస్ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఇటీవల కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు.. చేపట్టిన కార్యక్రమాలతో పీవీని తమ సొంతం చేసుకున్నారు.
సొంత పార్టీ వారికి పట్టని పీవీకి తెలంగాణ ట్యాగ్ తగిలించేసి.. అలాంటి రాజకీయ నేతకు గుర్తింపు లేకుండా చేస్తారా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసి మరీ తమ మనిషిగా ఇప్పటి తరం అనుకునేలా చేయటంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇందులో భాగంగా పీవీ కుమార్తె వాణీదేవిని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిబెట్టి.. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో ఆమె కేసీఆర్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఏమైనా.. తాజాగా ఏర్పాటు చేసిన పీవీ విగ్రహం ముందు ఇందిరమ్మ విగ్రహం చిన్నబోతున్న పరిస్థితి.