రీసెంటుగా ఏపీలో గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగమైన డిప్యూటీ కలెక్టరు పోస్టును దక్కించుకున్న స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో ఆఫర్ కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం చేస్తున్న పీవీ సింధుకు చంద్రబాబు నేరుగా డిప్యూటీ కలెక్టరు పోస్టు ఇచ్చారు. తాజాగా ఆమెను ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని యోచిస్తున్నారట. ఈ మేరకు సింధుకు చంద్రబాబు ఫోన్ చేసి చెప్పారని తెలుస్తోంది. అందుకు ఆమె అంగీకరించినట్లుగానూ తెలుస్తోంది.
నిజానికి ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత బాలీవుడ్ జంట అజయ్ దేవగణ్, కాజల్ లను ఏపీ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించారు. పరాయి రాష్ట్రాలవారిని నియమించారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అది జరిగిన కొద్దిరోజులకే అజయ్ దేవగణ్ పేరు పనామా పత్రాల్లో వచ్చింది. 2013లో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ లో మేరీలెబోన్ ఎంటర్ టైన్ మెంట్స్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటైన కంపెనీలో ఆయనకు వాటాలున్నట్లు తెలిసింది. హిందీ సినిమాల విదేశీ హక్కుల కొనుగోలుకు, కొల్లగొట్టడానికి ఈ కంపెనీని స్థాపించినట్లు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారిని పక్కనపెట్టారు. తాజాగా సింధు నియామకానికి అంతా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
2016లో జరిగిన రియో ఒలింపిక్స్ లో భారత్ తరుపున సింధు రజత పతకం సాధించింది. అందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.3 కోట్లు - డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం - తెలంగాణ ప్రభుత్వం రూ.5 కోట్ల నగదు బహుమతి ఇచ్చి సత్కరించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/