ఇండియా స్టార్ షట్లర్ పివి సింధు హైదరాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ OSD గా భాద్యతలు స్వీకరించనుంది. జూలై 2017 లో ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఈ మద్యే డిప్యూటీ కలెక్టర్‌గా శిక్షణా కాలం పూర్తి చేసుకుని పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ఆమెకి హైదరాబాద్ లోని లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ వద్ద ఓఎస్‌డీగా పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.
శుక్రవారం ఏపీ సిఎం జగన్ , పివి సింధును హైదరాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ OSD గా నియమించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టును ప్రభుత్వం ఓఎస్‌డి స్థాయికి అప్ గ్రేడ్ చేసింది. దాని కోసం, ప్రోటోకాల్ డైరెక్టర్ దానిపై ప్రతిపాదన పంపమని ఆదేశించారు. ఇకపోతే 2016 లో ఒలింపిక్స్‌లో ప్రతిష్టాత్మక రజత పతకం సాధించినందుకు సింధుకు అప్పటి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ పదవిని ఇచ్చిన విషయం తెలిసిందే. పీవీ సింధుకు 2018 డిసెంబర్ 7 నుంచి 2020 ఆగస్టు 30 వరకు ఆన్ డ్యూటీ సౌకర్యం మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.