భారత్ కు స్వర్ణ పతకం ఆశలు రేపిన మన సింధు పోరాడి ఓడింది. ప్రపంచ నంబర్ 1కు ముచ్చెమటలు పట్టించి హోరాహోరీ తలపడినా అనుభవం ముందు తలవంచింది. విజయ సింధువై వస్తుందనుకున్న సింధు రజత పతకంతో సరిపెట్టుకున్నా చరిత్ర మాత్రం సృష్టించింది. ఒలింపిక్సులో రజత పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. వరల్డ్ నంబర్ 1 స్పెయిన్ కు చెందిన కరోలినా మారియాతో ఫైనల్లో తలపడిన సింధు మొదటి సెట్ ను గెలుచుకోవడంతో అందరిలో ఆశలు మరింత బలపడ్డాయి. తొలుత మొదటి సెట్లోనూ కరోలినా ఆధిక్యంలో ఉన్నప్పటికీ సింధు మళ్లీ తిరగబడింది. అర్ధభాగం పూర్తయ్యేసరికి 6-11 తో వెనుకబడిన సింధు ఆ తరువాత పుంజుకుని వరల్డ్ నంబర్ వన్ ను ర్యాలీలతో, నెట్ గేమ్ తో ముప్పుతిప్పలు పెట్టింది. చివరికి సెట్ ను 21-19తో కైవసం చేసుకుంది.
ఇంక రెండో గేమ్ లో మాత్రం సింధు తొలి నుంచి వెనుకబడిపోయింది. మారియా బలమైన స్మాష్ షాట్లతో సింధుపై ఆధిపత్యం ప్రదర్శించి 14-6తో ఆధిక్యత సాధించింది. దీంతో సింధు 12- 21తో ఆ గేమ్ కోల్పోయింది. సింధు - కరొలినాలు 1-1తో సమానంగా నిలవడంతో మూడో గేమ్ కీలకమైంది. అందులోనూ ఒక దశ వరకు కరోలినా ఆధిపత్యం ప్రదర్శించినా మళ్లీ సింధు పుంజుకుంది. అయితే, అప్పటికే ఆలస్యమైంది. కరోలినా ముందంజలో ఉండడంతో ఆమె ఆత్మవిశ్వాసం ముందు సింధు నిలవలేకపోయింది. అయితే, చివరి వరకు పోరాడిన సింధు భవిష్యత్ తారగా మాత్రం భారత్ ఆశలను సజీవంగా ఉంచిందని చెప్పొచ్చు.
తొలిసారి ఒలింపిక్సులో అడుతున్నప్పటికీ, తనకంటే ఎంతో అపార అనుభవం, ప్రతిభా పాటావాలున్న క్రీడాకారిణిలు ప్రత్యర్థులుగా ఎదురైనప్పటికీ ఆవేమీ పట్టించుకోకుండా సింధు ఫైనల్ వరకు చేరుకోవడం విశేషం. 1.79 మీటర్ల ఎత్తున్న 21 ఏళ్ల ఈ హైదరాబాదీ క్రీడాకారిణికి ఎత్తు కూడా అదనపు బలంగా మారింది. అయితే.. ఫైనళ్లో వరల్డ్ నంబర్ 1 కరోలినా చురుకైన కదలికల ముందు సింధు వేగం చాలలేదు.
సింధు స్టోరీ ఇదీ..
పూర్తి పేరు: పూసర్ల వెంకట సింధు
పుట్టిన తేదీ: 5 జూలై 1995 - హైదరాబాద్
ఎత్తు: ఐదు అడుగుల 9 అంగుళాలు
ఆట: కుడి చేతి వాటం
కేరీర్: 13 ఏళ్ల క్రితం సింధు కెరీర్ ప్రారంభించింది
ఏ వయసు నుంచి: ఎనిమిదేళ్ల వయస్సు నుంచి ఆడుతోంది. ఇప్పుడు వయస్సు 21.
తల్లిదండ్రులు: ఇద్దరూ క్రీడాకారులే. తండ్రి పీవీ రమణ - తల్లి విజయలు వాలీబాల్ ఆటగాళ్లు.
కోచ్: పుల్లెల గోపీచంద్. హైదరాబాదులోని గోపీచంద్ అకాడమీలో పదేళ్లుగా శిక్షణ పొందుతోంది.
తొలి కోచ్: మెహబూబ్ అలీ
ప్రస్తుత ప్రపంచ ర్యాకింగ్: 9వ ర్యాంక్
సింగిల్ టైటిల్స్: 6
ఇండోనేషియా ఇంటర్నేషనల్ 2011 - మలేషియా మాస్టర్స్ (2013 - 2016) - మకావ్ ఓపెన్ (2013 - 2014 - 2016)
కాంస్యం: ప్రపంచ ఛాంపియన్ షిప్ 2013 (గాంగ్ జౌ)
కాంస్యం: ప్పపంచ ఛాంపియన్ షిప్ 2014(కోపెన్ హాగెన్)
కాంస్యం: ఏషియన్ గేమ్స్ - 2014
కాంస్యం (2): ఉబెర్ కప్ టీమ్ (న్యూఢిల్లీ 2014 - కున్షన్ 2016)
కాంస్యం: కామన్ వెల్త్ గేమ్స్ 2014 (సింగిల్స్ కేటగిరీ)
కాంస్యం (2): ఏషియన్ జూనియర్ ఛాంపియన్‌షిప్ (2011 లక్నో - సింగిల్స్ - మిక్స్డ్ టీం)
స్వర్ణం: గిమ్ చియాన్2012 (సింగిల్స్)
స్వర్ణం: డోగ్లాస్ 2011 (సింగిల్స్)
అవార్డులు: పద్మశ్రీ (2015) - అర్జున అవార్డు (2013)
- ఇప్పటి వరకు సింధు తన క్రీడా కెరీర్ లో 184 మ్యాచ్ ల్లో విజయం సాధించగా - 86 మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది
--------
సింధు రజతంతో...
- ఒలింపిక్సులో భారత్ నుంచి రజత పతకం సాధించిన తొలి మహిళ
- బ్యాడ్మింటన్ లో ఇండియాకు తొలి రజతం
- కరణం మల్లీశ్వరి తరువాత ఒలింపిక్ సాధించిన తెలుగు అమ్మాయి
- పుల్లెల గోపీచంద్ అకాడమీ నుంచి సాధించిన అత్యున్నత విజయం