రియో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులంతా ఉట్టి చేతులతో వెనుదిరుగుతున్న సమయంలో... వంద కోట్ల మంది భారతీయుల మనసుల్లో పతకంపై ఆశలు చిగురించేలా చేయడమే కాకుండా... ఏకంగా రజత పతకాన్ని సాధించి పెట్టిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, స్టార్ షట్లర్ పీవీ సింధూ ఇకపై డిప్యూటీ కలెక్టర్ హోదాలో సర్కారీ కొలువులో చేరనుంది. రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన పీవీ సింధూకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారత ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు భారీ నజరానాలను ప్రకటించిన విషయం తెలిసిందే. నగదు బహుమతులతో పాటు ఏపీ సర్కారు... సింధూ ఒప్పుకుంటే ఆమెను డిప్యూటీ కలెక్టర్ (గ్రూప్-1) అధికారిగా నియమించేందుకు సిద్ధమని ప్రకటించింది.
తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహా ప్రకటన చేసినప్పటికీ... తాను ఏపీకి చెందినదానినన్న ఉద్దేశంతో పీవీ సింధూ... ఏపీ ప్రభుత్వ ప్రకటనకు తన సానుకూలతను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆమెను గ్రూప్-1 అధికారిణిగా నియమించేందుకు అవసరమైన కసరత్తును చంద్రబాబు సర్కారు పూర్తి చేసింది. నేడో, రేపో ఈ మేరకు ఉత్తర్వులు వెలువడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ ప్రకటనకు సంబంధించిన విషయం తెలుసుకున్న పీవీ సింధూ కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/