పట్టు వదలని ప్రసాద్ ని అలియాస్ పివీపీ|

Update: 2019-07-19 16:20 GMT
ఎదుటోడిపై బురద జల్లేందుకు బురదలో రాయేస్తే అది పోయి పోయి తన మీదే పడినట్టుంది కేశినేని నాని పరిస్థితి. ఇటు టీడీపీలో ఉంటాడో బీజేపీలోకి వెళ్తాడో తెలియని అయోమయం తన ట్వీట్లతో టీడీపీలోనే క్రియేట్ చేశాడు నాని. ఎవరో ఎవరి చెవిలోనో ఏదో ఊదితే... తిరిగి అదే చెవిలో ఊదకుండా... నువ్వు చెవులో ఊదుతావా నా ప్రతాపం చూడు అంటూ బుద్దా వెంకన్న మీద తొలుత నాని ఆన్ లైన్ వార్ మొదలుపెట్టాడు. ఇక అది మొదలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఇద్దరు ఒకరికి సంబంధించిన ఆధారాలు ఇంకొకరు ప్రపంచం ముందు పెట్టి తమ పరువు తీసుకుని, పార్టీ పరువు తీసేశారు. ఎన్నికలు ముందు వైసీపీ చేసిన ఆరోపణలకు వాళ్లే స్వయంగా సాక్ష్యాలు అందించారు.

ఇలా ఇద్దరు టీడీపీ నేతలు సాక్షాలతో సహా తమను తాము బయటపెట్టుకుంటే ఇక ప్రత్యర్థులు ఊరుకుంటారా... నాని చేతిలో స్వల్ప ఓట్లతో ఓడిపోయిన ప్రత్యర్థి పీవీపీ రంగంలోకి దిగాడు. పదునైన వ్యాఖ్యలతో వ్యంగాస్త్రాలతో నాని పరువును బజారు కీడ్చాడు. మీరు మీరు కొట్టుకోవడమేనా ప్రజలకు ఏమైనా చేసేదుందా అంటూ తొలుత నానిపై ట్విట్టర్ వార్ మొదలుపెట్టి మెల్లగా తీవ్రత పెంచాడు పీవీపీ. దీంతో నాని తన యుద్ధాన్ని బుద్ధా వెంకన్న మీద నుంచి పీవీపీ మీదకు మరల్చాడు. రెండు మూడు రోజులుగా నాని వేసిన ప్రతి కౌంటరుకు పిచ్చెక్కించే కౌంటర్లు వేశారు పీవీపీ. ’రంకు రాజకీయం‘ అంటూ ఈరోజు నేరుగా దండయాత్ర చేశాడు.  అయితే, పీవీపీ తాజా ట్వీటు నానికి పెద్ద మంటే పుట్టించింది.

’’చిల్లర వాగుడు వాగే వెధవలను వదిలేయడానికి, ఇంకో చెంప చూపించమనే, మహాత్ముడిని కాదు ! చిరంజీవి గారి లాగా జెంటిల్మెన్ ని కాదు. పట్టు వదలని ప్రసాద్ ని, అలియాస్ పీవీపీ. నిన్ను వదల బొమ్మాళి.. సారీ, బేతాళ‘‘ అంటూ తను ఇక ముందు నాని పట్ల ఎలా వ్యవహరించబోతున్నాడో చెబుతూనే నా జోలికొస్తే తాటతీస్తా అన్నంతపని చేశాడు.


Tags:    

Similar News