చేసే వ్యాపారాన్ని పద్దతిగా చేస్తే ఎవరు మాత్రం ఏమంటారు? షోకుల డాబుతో.. అంతా సక్రమంగా సాగుతుందన్న బిల్డప్ ఇస్తూ.. ప్రేక్షకుల్ని ఇష్టారాజ్యంగా దోచేసే మల్టీఫ్లెక్సుల గుట్టు రట్టు అవుతోంది. తాజాగా తెలంగాణ తూనికలు కొలతల శాఖ అధికారుల వరుస తనిఖీలతో మల్టీఫ్లెక్సుల దోపిడీ ఏ రేంజ్లో ఉంటుందో ఇప్పుడు అందరికి అర్థమవుతూనే ఉంది. ఈ మధ్యన ఒక టీవీ ఛానల్ ఒక కొత్త తరహా ప్రయోగాన్ని చేసింది.
మల్టీఫ్లెక్సుల్లో రూ.180 నుంచి రూ.200 వరకు అమ్మే పాప్ కార్న్ ను.. ఇంట్లో తయారు చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుందన్నది ప్రత్యక్షంగా చూపెట్టే ప్రయత్నం చేసింది. చివరకు అది కాస్తా రూ.30 ఖర్చుతో థియేటర్ లో ఇచ్చే వాటితో సమానమని తేల్చింది. అది కూడా.. సూపర్ మార్కెట్లో దొరికే రూ.10 పాకెట్లు మూడింటితోనని నిరూపించిన వైనం అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. మల్టీఫ్లెక్సుల దోపిడీ ఈ రేంజ్లో ఉంటుందా? అన్నది తెలిసేలా చేసింది.
ఇదిలా ఉంటే.. తూనికలు కొలతల శాఖాధికారులు మల్టీఫ్లెక్సులు.. సినిమా థియేటర్లలో బాదుడుపై ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టారు. గడిచిన నాలుగైదు రోజులుగా అదే పనిగా వివిధ మల్టీఫ్లెక్సుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూల్స్ కు విరుద్ధంగా కొన్ని తినుబండారాలు అమ్ముతున్న వైనాన్ని గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు.
ఇదే తరహాలో బంజారాహిల్స్ సినీమ్యాక్స్ లోని పీవీఆర్ థియేటర్స్ లో ఆదివారం తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. కొన్ని పుడ్ ఐటెమ్స్ విషయంలో రూల్స్ ను బ్రేక్ చేసినట్లుగా తేలింది. దీంతో.. అక్కడి మానిటర్స్.. ఇతర పదార్థాలను సీజ్ చేసిన అధికారులు వాటిని తరలించే ప్రయత్నం చేశారు. దీంతో.. పీవీఆర్ రీజినల్ మేనేజర్ మంజిత్ సింగ్ అడ్డుకున్నారు.
అక్కడితో ఆగని ఆయన.. అధికారులతో వాదించారు. తూనికలు కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్ భాస్కర్ రెడ్డిని తోసేశారు. ఈ చర్యపై అధికారులపై విస్మయం వ్యక్తమవుతోంది. తప్పు చేయటమే కాదు.. అధికారుల్ని అడ్డుకోవటం.. వారిని తోసివేసే వరకూ మల్టీఫ్లెక్స్ ల సిబ్బంది వ్యవహరించటంపై అధికార వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో బంజారాహిల్స్ పోలీసులకు భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంజిత్ సింగ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.