గరీబ్‌ రథ్‌ లో కరోనా అలజడి...చేతికి క్వారంటైన్‌ ముద్రతో జర్నీ చేసిన నలుగురు !

Update: 2020-03-19 10:50 GMT
భారత్‌ లో కరోనా వైరస్‌ చిన్న చిన్నగా విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య దేశంలో పెరిగిపోతోంది. ఇప్పటివరకు భారత్ లో 151 కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఒకవైపు దేశవ్యాప్తంగా కఠిన చర్యలు చేపడుతున్నప్పనటికీ కొందరి నిర్లక్ష్యం కారణంగా కరోనా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా ఇండియా లోకి కరోనా వ్యాప్తి చెందిందే విదేశీయుల వల్లే. విదేశాల నుండి వచ్చిన వారిలోనే ఎక్కువగా కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి.

కరోనా నివారణకి తీసుకోవాల్సిన జాగ్రత్తల తో ప్రజలు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో తాజాగా జరిగిన ఓ సంఘటన గురించి తెలుసుకుంటే మీకే తెలుస్తుంది. విదేశాల నుంచి వచ్చిన ఓ నలుగురు యువకులు ముంబై నుంచి ఢిల్లీకి గరీబ్‌ రథ్‌ రైల్వే ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. అయితే ఆ నలుగురి చేతికి క్వారంటైన్‌ ముద్ర ఉంది. అంటే.. కరోనా అనుమానితులుగా గుర్తించిన వారికి ఈ ముద్ర వేస్తారు. జనసమూహాల్లో కలవకుండా వారిని క్వారంటైన్‌ లేదా ఇంట్లోనే ఉండేలా అధికారులు సూచనలు చేస్తున్నారు. అయితే వీరు మాత్రం అధికారుల సూచనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా రైల్లో ప్రయాణించారు.

ఈ విషయాన్ని అదే రైల్లో విధులు నిర్వహిస్తున్న టీసీ ఈ విషయాన్ని డహాణు స్టేషన్‌ వద్ద గమనించడం తో సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనితో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ రైలును పాల్ఘర్‌ స్టేషన్‌ లో ఆపేసి ఆ నలుగురిని దింపివేశారు. జర్మనీ నుంచి వచ్చిన ఈ నలుగురు పాల్ఘర్‌లో వైద్య పరీక్షల కోసం ఎదురు చూసేందుకు నిరాకరించారు. ఢిల్లీలోని తమ ఇంటికి వెళ్తామని పట్టుబట్టారు. చివరకు రాష్ట్ర కరోనా కంట్రోల్‌ రూమ్‌ తో సంప్రదించిన అనంతరం వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అనంతరం ఓ ప్రైవేటు వాహనం లో నలుగురిని సూరత్‌ పంపించారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు ఎంతగా చెప్తున్నప్పటికీ , వినడకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే ఇలాంటి వారివల్ల ..అమాయకులకు కూడా కరోనా సోకుతుంది.
Tags:    

Similar News