నిజమే ఇది ఒక సూటి ప్రశ్న. జవాబు చాలా చాలా కష్టమైన ప్రశ్నగానే చూడాలి. వైసీపీలో ఇదే తీరున డౌట్లు ఎన్నో ఉన్నాయి. అలాగే ధర్మాగ్రహం కూడా ఉంది. అవును మేము ఎందుకు పనిచేయాలని. ఇది డైరెక్ట్ గా సీఎం కే వేస్తున్న ప్రశ్నగా చెప్పుకోవాలేమో. వైసీపీలో చాలా మందికి పదవులు ఉన్నాయి. ఈ రోజున చూస్తే పంచాయతీ వార్డు నుంచి పార్లమెంట్ సభ్యుడి దాకా వైసీపీ వారే ఎటుచూసినా ఉన్నారు.
ఇక వైసీపీ నుంచి గెలిచిన సర్పంచ్ కి కానీ ఎంపీటీసీకి గానీ ఎంపీపీ జెడ్పీటీసీ ఇలా చెప్పుకుంటే దిగువన ఉన్న అనేక హోదాలలో స్థానిక పదవుల్లో గెలిచి సీట్లు ఎక్కిన వారికి ఏమి విలువ గౌరవం ఉన్నాయని వైసీపీకి పని చేయాలని అడుగుతున్నారు. వారికి పనులు చేసే సీన్ లేదు, అలాగే వారికి పలుకుబడి కూడా ఏ మాత్రం పెంచే సీన్ లేదు, ఇక పెత్తనం ఏమైనా వారికి ఇచ్చారా అంటే అదీ లేదు.
ఇక వైసీపీ క్యాడర్ చూస్తే మూడేళ్లుగా అలా మూలనే ముడుచుకుని కూర్చుంది. పేరుకు అధికార పార్టీలో ఉన్నామన్న మాటే కానీ కార్యకర్తలకు ఏమైనా పవర్ ఉందా వారి మాట ఎక్కడ అయినా చెల్లుబాటు అవుతోందా. ఇదే కదా టాప్ టూ బాటం సీన్ అని అంటున్నారు. మరో వైపు చూస్తే వాలంటీర్లను పెట్టి అన్నీ వారితోనే చేయిస్తున్నారు.
ఎక్కడ చూసినా వాలంటీర్లదే రాజ్యంగా ఉందని గ్రామాల్లో అంటున్నారు. ఇపుడు వైసీపీ హై కమాండ్ కి అర్జంటుగా వైసీపీ క్యాడర్ గుర్తుకు వస్తే రావచ్చు కానీ వారు మూడేళ్లుగా ఎలాంటి గుర్తింపు లేకుండా తమలో తాము కుమిలిపోయారు అనే అంటున్నారు. అంతా తమ చేతుల్లో లేదని, తాము ఏమీ కాకుండా సొంత పార్టీ వారికే అయ్యామని వారు మధనపడని రోజు అంటూ లేదుగా.
ఇపుడు వారిని పిలిచి బూత్ లెవెల్ కమిటీలు పనిచేయాలని హై కమాండ్ కోరితే తామెందుకు పనిచేయాలని వారు అంటున్నారు. వారు మరో మాట కూడా అంటున్నారు. మా ఇంట్లో తిని మీ ఇంట్లో పనిచేయాలా అని కూడా ఎకసెక్కమాడేలా అంటున్నారు. ఒక విధంగా ఇపుడు వారి అవసరం హై కమాండ్ కి వచ్చింది. చూస్తే గట్టిగా రెండేళ్ళు కూడా ఎన్నికలు లేవు. దాంతో వచ్చే ఎన్నికల్లో గెలిపించడానికి మళ్లీ బూత్ కమిటీలు, క్యాడర్ అన్నీ కూడా అక్కరకు వస్తున్నాయని అంటున్నారు.
ఇంతకాలం వాలంటీర్లు ఉంటే చాలు మరెవరూ అవసరం లేదన్న తీరుగా తమను నిర్లక్ష్యం చేసిన పెద్దలకు తాము గుర్తుకు రావడం నిజంగా వింతలో కెల్లా వింతే అంటున్నారుట క్యాడర్. పదేళ్ల పాటు పార్టీ కోసం తాను శ్రమించి ఎమ్మెల్యేలను గెలిపిస్తే పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్యకర్త అన్న వాడు ఒకరు ఉన్నారని అధినాయకత్వం నుంచి కింద స్థాయి వరకూ ఎవరూ అసలు గుర్తించలేదని వారు అంటున్నారు. ఇపుడు మాత్రం బూత్ కమిటీలు పనిచేయలని విరగదీసుకుని మరీ ప్రత్యర్ధులకు ఎదురెళ్ళి పోరాడాలని అంటే మాత్రం కుదిరే పనేనా అని కూడా నిలదీస్తున్నారు.
ఒక విధంగా చూస్తే ఇదంతా అధినాయకత్వం స్వయంగా తానుగా చేసుకున్న అపరాధమే అని అంటున్నారు. పవర్ లో ఉన్నపుడు క్యాడర్ కనిపించదు, తీరా అవసరం పడితే మాత్రం పార్టీ జెండా అజెండా, దానికి జీవకర్ర లాంటి కార్యకర్త ఠక్కున గుర్తుకు వస్తారని అంటున్నారు. మరి ఇంతలా వైసీపీ మీద అసంతృప్తిని వెళ్లగక్కుతున్న క్యాడర్ ని దగ్గరకు ఎలా తీస్తారో చూడాలి. పార్టీ మేము వేరు కాదు ఒక్కటే అని రెక్కలు ముక్కలు చేసుకున్న క్యాడర్ మనసు విరిగిన వేళ వారిని ఎలా బుజ్జగించి దారికి తెస్తారో కూడా ఆలోచించాల్సిందే.