గ్రూప్ టు ప్రిలిమ్స్ పరీక్షలో అడిగిన ప్రశ్నలను తప్పుపడుతూ కథనాన్ని ఇచ్చింది ఒక ప్రముఖ మీడియా సంస్థ. గ్రూప్ టు అభ్యర్థులను పరీక్షల్లో కూడా ఎలాంటి ప్రశ్నలు అడగాలో మీడియానే డిసైడ్ చేస్తున్నట్టుగా ఉంది. ఈ విషయంలో ఆ పత్రిక చాలా ఆక్షేపించింది. ఇంతకీ ఆ పత్రిక బాధ ఏమిటి? అంటే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ప్రశ్న అడగటమే దాని బాధ అని తెలుస్తోంది.
'దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తేదీ..' అని ఒక ప్రశ్నను అడిగారట. అది పెద్ద తప్పు అయినట్టుగా ఆ పత్రిక రియాక్ట్ అయిపోయింది. వైఎస్ ఏమీ పదవి కోల్పోయాకా.. వృద్ధుడు అయ్యి చనిపోలేదు. అలా చనిపోయి ఉంటే ఆ ప్రశ్న అడగటం అంత సబబు కూడా కాదు.
ముఖ్యమంత్రి పదవిలో ఉండి.. తన విధుల్లో భాగంగా ప్రయాణిస్తూ ఆయన మరణించారు. ఈ విషయంపై రాష్ట్రంలో ఎంతో విస్తృతమైన చర్చ జరిగింది. కొన్ని రోజుల పాటు వైఎస్ మరణం ప్రజలను కదిలించి వేసింది. వైఎస్ మరణంతో రాష్ట్రం పరిస్థితే మారిపోయింది. వైఎస్ మరణం ఎన్నో పరిణామాలను ప్రభావితం చేసింది.
ఇక రాజకీయంగా చూసినా వైఎస్ మరణం చర్చనీయాంశంగా నిలుస్తూ ఉంటుంది.ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ వర్ధంతిని నిర్వహిస్తూ ఉంటుంది. పత్రికలను చదివే వాళ్లకు ఆ తేదీ సెప్టెంబర్ రెండు అని గుర్తుండటం ఏమాత్రం కష్టం కాదు. గ్రూప్ టు స్థాయి పరీక్షల్లో పత్రికల్లోని వార్తల ఆధారంగానే ఎక్కువ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో ఆ ప్రశ్న అడగడం ఏదో పెద్ద తప్పై పోయినట్టుగా ఒక పత్రిక కథనాన్ని ఇచ్చింది. తన తీరును మరోసారి బయట పెట్టుకుంది.