తెలంగాణకు హరితహారం. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం. రాబోయే నాలుగేళ్లలో 3 కోట్ల మొక్కలు నాటడం ద్వారా తెలంగాణలో గ్రీన్ కవర్ పెంచాలనేది కేసీఆర్ సంకల్పం. కానీ అదే సమయంలో విచ్చలవిడిగా చెట్లు నరికివేస్తున్నారు. అదికూడా ఎక్కడో అడవుల్లో కానేకాదు. సాక్షాత్తు సీఎం కేసీఆర్ నివసించే ఇంటి వెనుక! అది కూడా హరితహారం పట్ల జాగరుకులు అయిన ఐఏఎస్ అధికారులు నివసించే చోట!!
సీఎం క్యాంపు కార్యాలయం వెనక ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్ పాతబడినందున దాన్ని కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా భవనాన్ని కూల్చివేయడంతో పాటు త్వరలో అక్కడ ఉన్న చెట్లను నరికివేసేందుకు రంగం సిద్ధమైంది. ఇక్కడ ఉన్న చెట్లలో అనేకం దశాబ్దాల తరబడి ఉన్నవి. ఇక్కడి వాటిలో దాదాపు 30కి పైగా చెట్లను నరికివేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. త్వరలోటెండర్లు పిలిచేందుకు ఆర్ ఆండ్ బీ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
చెట్లను నాటేందుకు ట్రాన్స్ రీ లొకేషన్, ఇతరత్రా మార్గాలు ఉన్నప్పటికీ...సుదీర్ఘ చరిత్ర కలిగిన చెట్లను నరికివేయాలని చూడటం బాధకరమని పలువురు పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.