తన జూనియర్ బాగా ఆడితే అభినందించడం సీనియర్ కి గౌరవం. ఈ విషయాన్ని మరిచిపోయి కామెంట్స్ చేసిన హర్భజన్ పై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. "గత నాలుగేళ్లుగా భారత్ ఆడుతున్నటు పిచ్ లపై నేను - కుంబ్లే ఆడుంటే ఇంకా చాలా చాలా వికెట్లు పడగొట్టేవాళ్లం"... ఇండోర్ టెస్టులో అశ్విన్ విజృంభిస్తున్న అనంతరం ఒక సీనియర్ క్రికెటర్ గా హర్భజన్ చేసినవి ఈ వ్యాఖ్యలు. ప్రస్తుతం ఈ హర్యభన్ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఏ టైంలో దేనికుండే గొప్పతనం దానికుంటుంది. ఈ చిన్న విషయాన్ని మరిచిన బజ్జీ ఇలా నోరు జారాడు!!
సాదారణంగా ఉపఖండం పిచ్ లు ముఖ్యంగా మన దేశంలో పిచ్ లు స్పిన్నర్లకు సహకరిస్తాయన్నది తెలిసిన విషయమే. అయితే తాజాగా ముగిసిన న్యూజిలాండ్ తో సిరీస్ విషయంలో మాత్రం మంచి పిచ్ లు - కాస్త స్వింగ్ కి అనుకూలించే పిచ్ లు రూపొందించారని అందరూ అంటున్న తరుణంలో భజ్జీ అనవసర వ్యాఖ్యలతో విమర్శలు కొనితెచ్చుకున్నాడనే చెల్లాపి. మ్యాచ్ లు ముగిసిన తర్వాతే కాని, స్కోర్ కార్డు చూస్తున్నప్పుడు కానీ పిచ్ లు చెప్పుకుంటున్నంత విపరీతంగా స్పిన్ కు సహకరించలేదని, బ్యాట్స్‌మెన్ కు కంఫర్టబుల్ గానే ఉన్నాయన్న చెబుతున్నారు క్రీడాపండితులు. అయినా కూడా ఈ పిచ్ లపై అశ్విన్ 27 వికెట్లు తీయడం అంత సులువైన విషయం కాదు! ఈ విషయం సీనియర్ స్పిన్నర్ కి తెలియంది కాదు.
అలా అని స్పిన్ కు అనుకూలించే పిచ్ లపైనా, తోటి స్పిన్నర్లు వికెట్లు టప టపా పడగొట్టిన పిచ్ లపై అయినా భజ్జీ దుమ్ములేపాశాడా అనుకుంటే అలాంటిదేమీ లేదని రికార్డులు చెబుతున్నాయి. వాటిని ఒకసారి పరిశీలిస్తే... 2012లో ముంబయిలో ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో గెలిచిన టెస్టులో హర్భజన్ 84 పరుగులిచ్చి కేవలం రెండే వికెట్లు పడగొట్టగా, ఇదే పిచ్ పై ఇదే మ్యాచ్ లో ఇంగ్లాండ్ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఏకంగా 11 వికెట్లు పడగొట్టగా, మరో ఇంగ్లిష్ స్పిన్నర్ స్వాన్ ఎనిమిది వికెట్లు తీసుకున్నాడు. సరే ఇంగ్లిష్ వాళ్లకు బాగా అనుకూలించిందేమో అనే పిచ్చి వాదన చేసినా... భారత్ నుంచి ప్రజ్ఞాన్ ఓజా 5/159 అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఇదే క్రమంలో చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో కూడా భజ్జీ 143 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా - అదే మ్యాచ్ లో అశ్విన్ 12 వికెట్లు పడగొట్టాడు. అలాగే హైదరాబాద్ లో జరిగిన టెస్టులో కూడా హర్భజన్ కేవలం రెండు వికెట్లతో సరిపెట్టుకోగా అశ్విన్ - జడేజా చెరో ఆరు వికెట్లు పడగొట్టారు.
ఇలా అశ్విన్ - హర్భజన్ కలిపి ఆడిన మ్యాచుల్లో కూడా కొన్ని సందర్భాల్లో హర్భజన్ కంటే అశ్విన్ బెస్ట్ ఫెర్మార్మెన్సే కనబరిచాడు. భజ్జీ మాట్లాడేముందు ఒకసారి ఈ ఘణాంకాలను కూడా గుర్తు చేసుకుని ఉంటే అసూయతోనే మాట్లాడుతున్నాడన్న విమర్శలు భజ్జిపై వచ్చేవి కావు. అయితే... భారత క్రికెట్ కు హర్భజన్ అందించిన సేవలు తక్కువేమీ కాదు. భారత క్రికెట్ చరిత్రలో అతడి పాత్ర చాలా ముఖ్యమైంది. దానికి భజ్జీని అంతా గౌరవించాలి, గౌరవిస్తున్నారు కూడా. అయితే తన జూనియర్ - తన వారసుడి విషయంలో అతడి గొప్ప తనాన్ని గుర్తించకపోవడం మంచి నిర్ణయం కాదనే అనుకోవాలి. ఎందుకంటే... నిన్నకంటే నేడు, నేటి కంటే రేపు ఎప్పుడూ బెటర్ గానే ఉంటాయి, కాదు కాదు... ఉండాలి. అప్పుడే డెవలప్ మెంట్ ఉన్నట్లు. ఈ లాజిక్ మరిస్తే ఎట్టా భజ్జీ!?