నయీం కేసులో టీడీపీ ఎమ్మెల్యే విచారణ

Update: 2016-11-02 11:23 GMT
రెండు నెలల కిందట ఎన్ కౌంటర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో టీడీపీ ఎమ్మెల్యే - బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్యను సిట్ ఈ రోజు విచారించింది. నార్సింగి పోలీస్ స్టేషన్ లో కృష్ణయ్యను సిట్ ఐజీ నాగిరెడ్డి దాదాపు గంటసేపు విచారించారు. మాధాపూర్ లోని ఓ భూవివాదంపై ఆయనను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.  

కాగా కృష్ణయ్య విచారణ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, తనకు తెలిసిన విషయాలన్నింటినీ పోలీసులకు తెలిపానని చెప్పారు. తనకు ఎలాంటి అక్రమాల్లో ప్రమేయం లేదని... నయీంతో పరిచయాలు మాత్రం ఉన్నాయని.. అన్ని విషయాలూ చెప్పానన్నారు.

మరోవైపు నయీం తనను గురువుగా భావించేవాడని గతంలో కృష్ణయ్య తెలిపారు. నయీం గురించి తనకు అంతా తెలుసని... కానీ, అతని నేరాలతో తనకు సంబంధం లేదని చెప్పారు. రాడికల్ స్టూడెంట్ యూనియన్ లో ఉన్నప్పటి నుంచి నయీమ్ తన వద్దకు వచ్చేవాడని... విద్యార్థి సంఘాలతో కలసి చేసే ఉద్యమాలకు తాను మద్దతు ఇచ్చే వాడినని... ఈ క్రమంలో నయీంతో తనకు పరిచయాలున్నాయని చెప్పారు. కృష్ణయ్య ఇప్పటికే అదే మాటకు కట్టుబడి ఉన్నారే కానీ.. నయీం తనకు తెలియదని బుకాయించే ప్రయత్నమేమీ చేయలేదు. అయితే.. నయీం దందాలకు సంబంధించిన సమాచారమూ ఆయన వద్ద ఉందని.. సిట్ కు అన్ని విషయాలూ వెల్లడించారని సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News