ఆరెస్సెస్ అంటే తెల్లచొక్కా - ఖాకీ నిక్కరే గుర్తుకొస్తాయి. ఆరెస్సెస్ లో కార్యకర్త దగ్గర నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు ప్రతి ఒక్కరూ పరేడ్ సమయంలో తెల్ల చొక్కా - ఖాకీ నిక్కరే వేసుకుంటారు. కానీ, దసరా నుంచి వారి యూనిఫాం మారిపోయింది. తెల్లచొక్కా అలాగే ఉన్నా ఖాకీ నిక్కరు మాత్రం మారిపోయింది. నిక్కరుకు బదులు ఖాకీ రంగులోనే ఉండే ప్యాంటు ధరిస్తున్నారు. అయితే... ఆరెస్సెస్ యూనిఫాం మార్పుపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ కామెంట్లు చేశారు.
ఆరెస్సెస్ యూనిఫాం మారడానికి కారణం తన భార్య - బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి చెప్పడం వల్లే ఆరెస్సెస్ వాళ్లు ప్యాంట్లు ధరిస్తున్నారని ఆయన అన్నారు. పట్టపగలు కూడా సిగ్గు లేకుండా ఆరెస్సెస్ వాళ్లు నిక్కర్లతో తిరుగుతున్నారంటూ తన భార్య అనడంతో వాళ్లు నిక్కర్లు వదిలి ప్యాంట్లకు మారారని ట్వీట్ చేశారు.
ట్విటర్ వేదికగా లాలూ చేసిన ఈ కామెంట్లపై ఆరెస్సెస్ మాత్రం ఏమీ స్పందించలేదు. "ఇప్పుడే సగం ప్యాంట్లను ఫుల్ చేయించుకున్నాం. మా బుర్రలను కూడా ఫుల్ చేసుకుంటాం. నిక్కర్లే కాదు ఆలోచనలు కూడా మార్చుకుంటాం. ఆయుధాలు పక్కన పెడతాం. విషాన్ని వ్యాపించనివ్వం" - అంటూ ఆరెస్సెస్ ను ఉద్దేశించి లాలూ సెటైర్ తో పాటు కాస్త ఘాటు వ్యాఖ్యలు చేసినా ఆరెస్సెస్ మాత్రం సంయమనంగానే ఉంది.