హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లో గత కొద్దీ రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న సెక్స్ రాకెట్ ను పోలీసులు చేధించారు. పక్కా సమాచారంతో ఆ ఇంటిపై రైడ్ చేసి ఒక నిర్వాహకుడిని అరెస్ట్ చేసారు. కరోనా కోరలు చాచి కూర్చున్న ఈ సమయంలో కూడా కొందరు ప్రబుద్ధులు అక్రమ సంపాదన కోసం , వ్యభిచార దందాని కొనసాగిస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న కోరికతో మహిళల శరీరాలతో వ్యాపారం చేసేవారు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా ఇలాంటి సెక్స్ రాకెట్స్ బయటపడుతున్నాయి.
తాజాగా ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ కు చెందిన ఎ..శివకుమార్, కరీంనగర్ కు చెందిన చిన్నా స్నేహితులు. వీరికి పశ్చిమ బెంగాల్, ముంబయి, ఇతర రాష్ట్రాల్లో అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసే ముఠాలతో పరిచయాలు ఉన్నాయి. దీంతో సులభంగా డబ్బు సంపాదించాలనుకున్న వారిద్దరు వ్యభిచారం చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. దీనితో ఉద్యోగాల పేరుతో బ్రోకర్ల సాయంతో ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి దిల్‌సుఖ్‌నగర్ లోని ఇంట్లో పెడుతూ వచ్చారు. ఆ తరువాత అమ్మాయిల ఫోటోలను ఆన్ లైన్లో పెట్టి విటులను ఆకర్షించేవారు.
ఇలా విటులకి గాలం వేసి ఒక్కో కస్టమర్ నుంచి రూ. 5 వేల నుంచి 8 వేల వరకు వసూలు చేసి అమ్మాయిలను పంపించేవారు. రి ఎస్ వోటీ పోలీసులు ఆకస్మిక దాడి చేసి ఆ ముఠా గుట్టు బయటపెట్టారు. నిర్వాహకుడు శివకుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు యువతులను రక్షించారు. మరొక నిర్వాహకుడు చిన్నా పరారీలో ఉన్నాడు.