ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి చంద్రబాబు పాలనపై మండిపడ్డారు. చంద్రబాబు కడప జిల్లాలో రెండు పశువులను - అనంతపురంలో ఒక పశువును తన పశువుల పాకలో కట్టిపడేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కోట్లకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను చూస్తుంటే తమకు చాలా బాధగా ఉందని.. వారిని గెలిపించిన ప్రజలు ఇంకెంత బాధపడి ఉంటారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు పాలనను వ్యతిరేకిస్తూ వంచనపై గర్జన పేరుతో అనంతపురంలో నిర్వహించిన సభలో రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్రసంగించారు. ఒక వంచన .. రెండు వంచనలు పోనీ మూడు వంచనలైతే గుర్తుపెట్టుకొని మాట్లాడవచ్చని.. కానీ చంద్రబాబు కొన్ని వందల వంచనలకు పాల్పడ్డారని వాటన్నింటిని గుర్తుపెట్టుకోలేమని అన్నారు.
బీజేపీతో నాలుగేళ్లు జతకట్టిన చంద్రబాబు ఏపీలో చేసినవన్నీ వంచనలేనని ప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీతో స్నేహంగా ఉన్న సమయంలో ఉక్కు ఫ్యాక్టరీ - దుగరాజపట్నం - పోలవరం లాంటివి ఎందుకు గుర్తురాలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండడంతో దొంగ దీక్షలకు తెలుగుదేశం నేతలు తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కుట్రలు - కుతంత్రాలు పోవాలంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని రాచమల్లు ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం తామంతా అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని అన్నారు. విభజన హామీల కోసం వైఎస్ జగన్ మాత్రమే నిరంతరం పోరాటం చేస్తున్నాడని అన్నారు. చంద్రబాబు గద్దె దిగిన రోజునే తన భుజంపై నుంచి నల్ల కండువా కూడా తీస్తానని ఈ సందర్భంగా రాచమల్లు శపథం చేశారు.