అమెరికాలో జాత్యహంకార దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. మొన్నటికి మొన్న తెలుగు నేలకు చెందిన యువ ఇంజినీర్ కూచిబొట్ల శ్రీనివాస్ శ్వేతజాతీయుడి కాల్పుల్లో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అంతకు వారం రోజుల ముందుగా జరిగిన మరో జాత్యహంకార దాడిలో తెలంగాణకు చెందిన ఓ యువకుడు చనిపోయాడు. తాజాగా తెలుగు నేలకు చెందిన యువతి, తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన జ్యోతి అనే యువతి జాత్యహంకార దాడికి గురైంది. అమెరికాలో ఉంటున్న ఆమెపై కాసేపటి క్రితం శరీరం నిండా జాతి వివక్షను నింపేసుకున్న ఓ నల్ల జాతీయుడు విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో జ్యోతికి తీవ్ర గాయాలైనట్లు విశ్వసనీయ సమాచారం.
అయితే పలు వర్గాల ద్వారా అందిన ప్రాథమిక సమాచారం మేరకు జ్యోతికి ఎలాంటి ప్రాణాపాయం ఏమీ లేదట. ఘటన జరిగిన వెంటనే జ్యోతిని అక్కడి వారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జ్యోతికి అక్కడి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇటీవలి కాలంలో వరుసగా చోటుచేసుకుంటున్న జాత్యహంకార దాడులన్నీ దాదాపుగా భారత్ కు చెందిన వారు, ప్రత్యేకించి తెలుగు నేలకు చెందిన వారిపైనే జరుగుతుండటం గమనార్హం. ప్రస్తుతం జ్యోతిపై జరిగిన దాడికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/