అమెరికాలో మళ్లీ మారణహోమం.. దుండగుడి కాల్పుల్లో 8 మంది మృతి..!

Update: 2021-03-17 04:31 GMT
అమెరికాలో జాత్యంహకార దాడులు  సాధారణమే. తరచూ ఏదో ఒక రాష్ట్రంలో తెల్లజాతీయులు, నల్ల జాతీయులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడం అక్కడ పరిపాటి. అయితే నూతన అధ్యక్షుడిగా బైడెన్​ బాధ్యతలు చేపట్టాక ఇటువంటి ఘటనలు జరగలేదు. అయితే తాజాగా అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని అట్లాటా సిటీలో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. ఓ మసాజ్​సెంటర్లు, స్పా సెంటర్లలోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఇప్పటివరకు మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ ఘటనతో ఒక్కసారిగా అమెరికా ఉలిక్కి పడింది. గతంలో పాఠశాలల్లో పబ్​లలో జాత్యంహకార దాడులు జరిగేవి. తాజాగా మరోసారి ఇటువంటి ఘటన జరగడంతో అమెరికా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.  చనిపోయిన వాళ్లల్లో ఆసియా వాసులు కూడా ఉన్నట్టు సమాచారం.

స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం సాయంత్రం 4.30 నుంచి 6.00 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్టు సమాచారం.  అట్లాటా సిటీ లోని ఈశాన్య ప్రాంతంలో దుండగుడు రెచ్చిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి రాబర్ట్​ అరోన్​ లాంగ్​ (21) అనే వ్యక్తిని పోలీసులు అదుపు లోకి తీసుకొన్నారు.  అట్లాటా సిటీలోని చైజర్ బ్రిడ్జ్ ప్రాంతంలో గోల్డ్ స్పా, దానికి కొద్దిగా దూరంలోని అరోమా థెరపీ స్పా, మరో మసాజ్ సెంటర్లలో ఈ కాల్పులు జరిగాయి. చనిపోయిన వారంతా మహిళలే కావడం గమనార్హం. అయితే ఓ దుండగుడు స్పా, మసాజ్​ సెంటర్​లోకి చొరబడి మహిళలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

 స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిది. ఆ లోపే దుండగుడు కూడా పారిపోయాడు. చనిపోయిన వాళ్లంతా ఆసియాకు చెందని వాళ్లే కావడంతో ఇది జాత్యంహకార దాడి అని అనుమానిస్తున్నారు.  గత ఆదివారం చికాగోలోనూ ఇటువంటి ఘటన జరిగింది. ఓ దుండగుడు జరిపిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. అయితే జో బైడెన్​ హాయం లో ఇంత పెద్ద ఘటన జరగడం ఇదే తొలి సారి. మృతుల్లో ఆసియా వాసులు ఉండటం తో అమెరికా లోని భారతీయుల్లో టెన్షన్​ నెలకొన్నది.
Tags:    

Similar News