రైతుల‌ను కాల్చేస్తుంటే..మంత్రి యోగాలో బిజీ

Update: 2017-06-08 16:06 GMT
బీజేపీ నేత‌ల‌కు రైతుల నిర‌స‌న సెగ ఘాటు త‌గిలింది. కేంద్ర వ్య‌వ‌సాయశాఖ మంత్రి రాధా మోహ‌న్‌ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓవైపు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లో ఆందోళ‌న చేస్తున్న రైతుల‌ను పోలీసులు కాలుస్తుంటే.. తాను మాత్రం ఏమీ ప‌ట్ట‌న‌ట్లు యోగా గురు రామ్‌ దేవ్ బాబాతో క‌లిసి యోగా చేస్తూ క‌నిపించ‌డం వివాదానికి కార‌ణ‌మైంది. మంగ‌ళ‌వారం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని మంద్‌ సౌర్‌ లో ఆందోళ‌న చేస్తున్న రైతుల‌పై పోలీసులు కాల్పులు జ‌ర‌ప‌డంతో ఐదుగురు మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. దీనిపై ఇప్ప‌టికే అధికార‌, విప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తున్న‌ది.

బీహార్‌ లోని మోతిహ‌రిలో రామ్‌ దేవ్ బాబా నిర్వ‌హిస్తున్న మూడు రోజుల యోగా క్యాంప్‌ కు రాధా మోహ‌న్‌ సింగ్ హాజ‌ర‌య్యారు. ఇలాంటి స‌మ‌యంలో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి ఇలా ప్రైవేట్ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రు కావ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇది ముందుగా నిర్ణ‌యించిన‌ షెడ్యూల్ అని కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ వెల్ల‌డించింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లో ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న ఆరా తీస్తూనే ఉన్నార‌ని తెలిపింది. ఇవాళ ఉద‌యం మంద్‌ సౌర్‌ కు వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించిన కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయ‌డంతో ఈ అంశం పొలిటిక‌ల్ ట‌ర్న్ తీసుకుంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ తోపాటు మ‌హారాష్ట్ర‌లోని షోలాపూర్‌ లోనూ 4 వేల మంది రైతులు రోడ్ల‌పైకి వ‌చ్చి నిర‌స‌న తెలుపుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News