వంగవీటి రంగా అంటే.. ఠీవీ ఉన్న నాయకుడు. ఠీవీగా బతికిన నాయకుడు. అయితే, ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాధా.. ఏం చేస్తున్నారు. ఆయన తీసుకుంటున్న స్టాండ్ ఏంటి? ఆయన వ్యవహ రిస్తున్న తీరేంటి? ఇదీ.. ఇప్పుడు ఆసక్తిగా మారుతున్న విషయం. ఎందుకంటే.. తనకు ప్రత్యర్థులు ఎవరో.. మిత్యర్థులు ఎవరో కూడా ఆయన ఎంచుకోలేక పోతున్నారని.. కాపు నేతల్లోనే చర్చసాగుతోంది.
రంగా అంత కాకపోయినా.. కనీసం.. రాధాకు ఒక వ్యూహం అంటూ ఉండాలిగా. తాజాగా రాధాకు సంబం ధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. అవి పాతవే. ఒకప్పుడు కాంగ్రెస్, తర్వాత.. ప్రజారాజ్యం, తర్వాత వైసీపీల్లో ఉన్నప్పుడు.. రాధా చేసిన కామెంట్లు ఇప్పుడు ప్రజల ఫోన్లలో మార్మోగుతున్నాయి. అదేసమయంలో తాజాగా రాధా చేసిన వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
వీటిని పరిశీలిస్తే.. రాధా దారేదీ? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. గతంలో తన తండ్రి, ప్రజానాయ కుడు రంగాను చంద్రబాబు చంపించారని.. పదే పదే చెప్పారు రాధా! ఈ వీడియో ఇప్పుడు ఎవరు వెలుగు లోకి తెచ్చారనే పిడకల వేట మానేస్తే.. అన్నారా లేదా అన్నదే చర్చ. ఇక, ఇప్పుడు ఎవరో చేసిన తప్పునకు టీడీపీని ఎలా విమర్శిస్తాను? అని చేతులు కట్టుకుని ఆయన కు ఆయనే క్షమాపణలు చెప్పుకొన్నారు.
ఇక్కడ ఒక కట్ ఇచ్చేస్తే.. మరి రంగా ఎప్పుడైనా ఇలా వ్యవహరించారా? అనేది ప్రశ్న. రంగా తన జీవిత కాలంలో తుదిశ్వాస విడిచేవరకు ఒకే మాట. ఒకే బాట. "రంగా అన్న మాటిస్తే.. అంతే!" అనే టాక్ ప్రబలంగా ఆ చివరి నుంచిఈ చివరి వరకు వినిపించింది. ఉభయ గోదావరుల్లో ఆయన పేరుకు మారు లేదు. అలాంటి రంగా వారసుడిగా.. తప్పులపై తప్పులు చేస్తూ.. ఒక స్టాండ్ అంటూ లేకుండా వ్యవహరిస్తున్న రాధా ఫ్యూచర్‌ను తలుచుకుని కాపు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.