భారత్ అమ్ముల పొదిలో మరో కీలక అస్త్రం చేరింది. రాఫెల్ యుద్ధ విమానాలు ల్యాండింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం వచ్చేసింది. భారత వైమానిక దళం చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. ఫ్రాన్స్ నుంచి అంబాలా వైమానిక స్థావరానికి బయల్దేరిన రాఫెల్ యుద్ధ విమానాలు కొదిసేపటి క్రితం హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్ ప్రాంతంలో గల వైమానిక దళ ఎయిర్‌బేస్ స్టేషన్‌లో ల్యాండ్ అయ్యాయి. మార్గమధ్యలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కొద్దిసేపు విశ్రాంతి కోసం వాటిని ల్యాండ్ చేశారు. అయితే , చారిత్రకమైన ఘట్టాన్ని చిత్రీకరించేందుకు మీడియాకు అవకాశం దొరకలేదు. అంబాలా కంటోన్మెంట్ ప్రాంతం వద్దే జనరల్ పబ్లిక్ తో పాటు మీడియాను కూడా నిలిపేశారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి భారత్ కి బయల్దేరిన రాఫెల్ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశంచిన వెంటనే ఐఎన్ ఎస్ కోల్ కత డెల్టా 63 వాటికి ఘన స్వాగతాన్ని పలికింది. అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్ ఎస్ కోల్‌కత డెల్టా నుంచి స్వాగత సందేశాన్ని రాఫెల్ యుద్ధ విమానాల కమాండర్ కు పంపించారు. ఘన స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. దానికి రాఫెల్ కమాండర్.. కృతజ్ఙతలు తెలిపారు. భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే రెండు సుఖోయ్ యుద్ద విమానాలు వాటికి గార్డ్ చేశాయి. గమ్యస్థానానికి బయలుదేరిన పక్షుల గుంపులా వీ షేప్ లో అయిదు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ వైపు దూసుకొస్తుండగా.. వాటి చివరలో రెండు సుఖోయ్ -30 ఎంకేఐ యుద్ధ విమానాలు రక్షణగా నిలిచాయి.
ఈ జెట్ ఫైటర్స్‌ను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వైమానిక దళాధినేత రాకేష్ కుమార్ భడౌరియా సహా పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. రఫెల్ ల్యాండ్ అయిన వెంటనే వాటిపై నీళ్లను చల్లుతూ స్వాగతం పలికారు. కొత్త ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయిన సమయంలో వాటర్ క్యానన్లతో స్వాగతం పలకడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే ఆనవాయితి కొనసాగించారు. ఇక్కడి నుంచి వీటిని లడఖ్ వారి బేస్ కు ఆ తరువాత అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్ లోని ఎయిర్ బేస్ కు తరలిస్తారు. ఇందుకోసం రూ. 400 కోట్ల రూపాయలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లడఖ్, పశ్చిమ బెంగాల్ ఎయిర్ బేస్ లను ఇప్పటికే ఆధునీకరించింది.
భారత్ పై , చైనా చర్యలు ఎక్కువవుతున్న తరుణంలో రాఫెల్ జెట్లు కీలక పాత్ర పోషించబోతున్నాయని డిఫెన్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాఫెల్ యుద్ధ విమానాలను సుఖోయ్ విమానాలు తోడ్కొని వస్తున్న వీడియోను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.