దేశ రాజధాని హస్తినా లో...ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అప్,బీజేపీ, కాంగ్రేస్ పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. మూడు నిత్యం ప్రచారం చేస్తున్నాయి. అధికారంలో ఉన్న ఆప్...తన ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అయితే, ఢిల్లీలోని రాజేంద్ర నగర్ స్థానం నుంచి 31 ఏళ్ల రాఘవ్ చద్దా అనే అభ్యర్థి పోటీలో ఉన్నాడు. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన చద్దాకు..ప్రచారంలో చిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. ‘నిన్నే పెళ్లాడాలనుంది’ అంటూ ప్రపోజల్స్ జోరుగా వస్తున్నాయి.
సీఏ చదివిన రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీలో చేరి రాజకీయ ప్రస్తానం మొదలుపెట్టిన కొన్నాళ్లకే పార్టీ అధికార ప్రతినిధి అయ్యారు. ప్రస్తుతం ఎన్నికల్లో ఢిల్లీలోని రాజిందర్ నగర్ నియోజకవర్గం నుంచి ఆప్ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆప్ స్టార్ క్యాంపెయినర్ గా కూడా కేజ్రీవాల్ ప్రకటించారు. ఆయన తన నియోజకవర్గం తో పాటు ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లోనూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆ క్యాంపెయిన్ ఫొటోలు, వీడియోలను తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ చేసి సోషల్ మీడియా వేదికగా కూడా సపోర్ట్ రాబట్టుకుంటున్నారు. సాధారణంగా నేతల ఎన్నికల ప్రచారం నచ్చితే..జనాలు వారికి నీరాజనం పలుకుతారు. అయితే రాఘవ్ చద్దా కు మాత్రం కాస్త కొత్త అనుభవాలు ఎదురవుతున్నాయి. `మ్యారీ మీ.. ప్లీజ్!` అంటూ ఎమ్మెల్యే అభ్యర్థి కి డజన్ల కొద్దీ ప్రపోజల్స్ యువతుల నుంచి వస్తున్నాయి.
రాఘవ్ చద్దా సోషల్‌మీడియా ఖాతాలను పర్యవేక్షిస్తోన్న టీం ఈ ఆసక్తికర వివరాలను వెల్లడించింది.
రాఘవ్ ప్రచారంలో పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో పాపులర్ అవుతుండటంతో..నన్ను పెళ్లి చేసుకుంటారా అంటూ యువతులు కామెంట్లు పెడుతున్నారట. పెద్ద వయస్సు వాళ్లవైతే..ఒక వేళ నాకే కూతురు ఉంటే నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను అంటూ కామెంట్లు పెడుతున్నారట. టీవల ఆయన్ని పెళ్లి చేసుకుంటానని ఓ యువతి కోరితే.. ‘ప్రస్తుతం ఎకానమీ మంచిగా లేదు. పెళ్లి చేసుకోవడానికి ఇది సరైన టైం కాదు’ అని రాఘవ్ రిప్లై ఇచ్చినట్లు సోషల్ మీడియా మేనేజర్ చెప్పారు. 2015 నుంచి ప్రేమిస్తున్నానంటూ ఓ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేసింది. అలాగే మరో యువతి తన సోదరికి రాఘవ్ ఇన్‌స్పిరేషన్ అని, ఆయన్ని చూసి సీఏ చేరిందని, చదువు పూర్తయ్యాక సంబంధం మాట్లాడడానికి తన తండ్రి ని పంపాలనుకుంటోందని చెప్పింది.