రాఘవేశ్వర భా'రతి' స్వామీజీ

Update: 2015-10-24 10:32 GMT
తనకు భక్తురాలిగా ఉన్న ఓ గాయనిపై అత్యాచారం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రపుర మఠాధిపతి రాఘవేశ్వర భారతి స్వామిపై సిఐడి ఛార్జిషీటు దాఖలు  చేసింది. స్వామీజీపై ఆరోపణలకు ఆధారాలు దొరకడంతోనే సీఐడీ ముందుకు ప్రొసీడైనట్లు తెలుస్తోంది.

48 ఏళ్ల ఓ మహిళ రామకథలు చెప్పేది. ఆమె ఈ స్వామీజీకి భక్తురాలు. ఆమెపై 2011 జూన్‌ నుంచి 2014 జూన్‌ 26వ తేదీలమధ్య స్వామీజీ పలుమార్లు అత్యాచారం జరిపారన్నది ఆరోపణ. స్వామీజీ ఆమెను పలు సందర్భాలలో ఏదో ఒక కారణంతో తన గదికి పిలిచి అత్యాచారానికి పాల్పడేవారట. తాను హాజరయ్యే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆమెను కూడా వెంట తీసుకుని వెళ్లేవాడు. భారతీస్వామి అసలు పేరు హరీష్‌ శర్మ.

కాగా తాను చెప్పినట్లు వినకుంటే రాముడు శపిస్తాడని ఆమెను బెదిరించేవారట స్వామీజీ. బాధితురాలు తన భర్తకు తెలిస్తే ఏం జరుగుతుందోనని, తన ఇద్దరు కుమార్తెలకు హాని కలుగుతుందని భయంతోనూ అతడు చెప్పినట్లు నడుచుకునేది.  బాధితురాలు అత్యాచారానికి గురైనట్లు ఫోరెన్సిక్‌ సైన్స్‌ విభాగం రిపోర్టులో వెల్లడి కాగానే సిఐడి అధికారులు అతడిపై ఛార్జిషీటు దాఖలు చేశారు. చాలామంది స్వాములోర్లలాగే ఈయనా దీన్నుంచి బయటపడతారో లేదంటే ఊచలు లెక్కబెడతారో చూడాలి.
Tags:    

Similar News