నర్సాపురం బరిలో నిలిచిన నాగబాబు తొడగొట్టారు.. ఇంత లావుగా ఉంటే తంతాం అంటూ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి హెచ్చరికలు పంపారు.. అలా అంటే ఊరుకుంటారా.? నేను లోకల్ అంటూ నర్సాపురం వైసీపీ అభ్యర్థి పడగొడుతానంటున్నారు. నర్సాపురంలో సవాల్ అంటూ నాగబాబుపై విరుచుపడుతున్నారు.
బుధవారం మీడియాతో మాట్లాడిన వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణం రాజు.. తనపై నాగబాబు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ‘‘ఇంత లావుగా ఉంటే తంతాం అంటావా’’ అంటూ నాగబాబుపై ఫైర్ అయ్యారు. నువ్వు తంతే భయంతో ఊరుకునే వారు ఎవరూ లేరని.. ఎప్పుడొస్తావో చెప్పు నాగబాబు.. ఇదే నా చాలెంజ్ అంటూ సవాల్ చేశారు. నన్ను తంతావో లేదో చూద్దాం.. మీరు సినిమాల్లో నటించినట్టు పశ్చిమ గోదావరి జిల్లాలో నటిస్తామంటే కుదరదని.. మీకు సినిమా చూపిస్తామంటూ రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు.
సొంత ఊరులో లైబ్రరీ పెట్టుకుంటామని చిరంజీవి ఫ్యామిలీ ఆస్తులు ఇవ్వమని గ్రామస్థులు అడిగితే పొత్తుల ఆస్తి అని అమ్ముకున్నవ్యక్తి నాగబాబు అని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. నాగబాబు గురించి జిల్లాలో ఎవరికైనా తెలుసనని.. ఎన్నికల కోసమే మల్లీ వచ్చారని విమర్శించారు. విలువల గురించి మాట్లాడడం మాని ప్రజా సమస్యలపై మాట్లాడు అంటూ హితవు పలికారు.
తాను పార్టీలు మారలేదని.. సొంతగూటికి వచ్చానని..కానీ నాగబాబు పొత్తులంటూ ఏడు కండువాలు మెడలో వేసుకొని తిరుగుతున్నాడని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. చివరకు కేఏపాల్ కండువా కూడా వేసుకో అంటూ హితవు పలికారు. నాగబాబు వల్ల ఆయన సోదరులపై ఉన్న విలువ, పరువు పోతోందని విమర్శించారు. పవన్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని.. రెండు రాష్ట్రాల మధ్య శాంతి చెడగొడుతున్నారని.. ప్రశాంతంగా ప్రచారం చేసుకోండని హితవు పలికారు. ప్రజలకు ఏం చెప్తారో.. చెప్పండని.. ప్రశాంతమైన జిల్లాలో శాంతిని ఉంచండి అని సూచించారు.