ఆనందగజపతి వారసురాలు సంచయిత కాదు.. ఉర్మిళ!

Update: 2020-11-02 17:40 GMT
ఆనందగజపతిరాజు అసలు వారసురాలు ఉర్మిళ అని.. ప్రస్తుత మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయితకు ఆ హక్కు లేదని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు స్పష్టం చేశారు. ఈ మేరకు కొన్ని ఆధారాలను, రికార్డులను రఘురామ మీడియాకు వివరించారు.

ఆనంద్ గజపతిరాజు నుంచి సంచయిత తల్లి ఉమా గజపతిరాజు విడాకులు తీసుకున్న తర్వాత ఢిల్లీ వెళ్లిపోయి కొద్దిరోజులకే రమేశ్ శర్మ అనే వ్యక్తిని వివాహం చేసుకుందన్నారు. 2013 నవంబర్ లో సంచయిత రాసిన ఓ ఆర్టికల్ లో వీటిని ధ్రువీకరించిందని.. ఢిల్లీలో చదువుకున్న సంచయిత తన తండ్రి పేరు ‘రమేశ్ శర్మ’ అని ఆ ఆర్టికల్ లో స్పష్టంగా తెలిపిందని రఘురామ ఆధారాలు చూపించారు. సంచయిత స్కూల్ రికార్డులలో కూడా తన తండ్రి రమేశ్ శర్మ అని రాశారని రఘురామ తెలిపారు.

ఆనందగజపతిరాజుతో విడిపోయాక సంచయిత తల్లి, ఈమె కనీసం చనిపోతే కూడా చూడడానికి రాలేదని.. పూర్తిగా దూరంగా ఉన్నారని రఘురామ తెలిపారు. ఆనందగజపతిరాజు మళ్లీ విజయనగరంకు చెందిన సుధారాణిను పెళ్లి చేసుకొని ఉర్మిళ అనే కూతురును కన్నారని వివరించారు.ఆనందగజపతిరాజు తన వారసురాలిగా ఉర్మిళనే పేర్కొంటూ వీలునామా రాశాడని కాబట్టి గజపతిరాజుల వారసురాలు ఉర్మిళ అని రఘురామ తెలిపారు.

ఎవరి అండో చూసుకొని సంచయిత చెలరేగిపోతే రేపోమాపో కోర్టు ఆదేశాలు వస్తాయని రఘురామ తెలిపారు. ఎవరి ట్రాప్ లోనో పడొద్దని.. మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులు రక్షించుకోండి అని రఘురామ హితవు పలికారు.
Tags:    

Similar News