ఓ పార్టీ నేతలు మరో పార్టీలోకి వెళ్లడం....కర్చీఫ్ లు మార్చేసినంత ఈజీగా పార్టీ కండువాలు మార్చేయడం..... అప్పటివరకు ఆహా ఓహో అంటూ...పొగిడిన పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం ....ఇలాంటి జంప్ జిలానీలందరినీ చూసి ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. అయితే, తాజాగా - ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా దాదాపుగా అదే తరహాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటేయాలని కోరుతూ ఆ పార్టీ తరపున ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తానని స్టేట్ మెంట్ ఇచ్చేశారు. అయితే, వాణిజ్య ప్రకటనల కింద స్టార్ మార్క్ లాగా....తన ప్రకటనకు కూడా టెర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటున్నారు రఘువీరా. అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం నియోజకర్గంలో ఉన్న కల్యాణదుర్గం చెరువుకు టీడీపీ సర్కార్ నీళ్లు అందిస్తే చాలు...ఆ పార్టీ ప్రచారకుడిగా మారిపోతానంటున్నారు ఈ మాజీ మంత్రి వర్యులు. అయితే, రాబోయే ఎన్నికల్లోపు ఆ చెరువుకు నీళ్లు అందించాలని మరో షరతు కూడా పెట్టారు. ఉన్నట్లుండి రఘువీరాకు ఆ చెరువుపై అంత ప్రేమ పుట్టుకురావడానికి బలమైన కారణం కూడా ఉందిలేండి.
పునర్విభజనలో భాగంగా రఘువీరా సొంత నియోజకవర్గం మడకశిర రిజర్వ్ డ్ కావడంతో కల్యాణదుర్గం నుంచి ఆయన పోటీ చేసి గెలుపొందడమే కాకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు.అయితే, విభజన నేపథ్యంలో గత ఎన్నికల్లో పెనుకొండ నుంచి పోటీ చేశారు. స్థానికుడైన పార్థసారథికి పరిటాల సునీతకు విభేదాలుండడంతో ఆమె ...రఘువీరాకు మద్దతు తెలుపుతానని హామీ ఇచ్చినట్లు పుకార్లు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న పార్థసారథి రాప్తాడు లోని తన వర్గ ప్రజలను వైసీపీకి మద్దతు ఇవ్వాలని కౌంటర్ ఇచ్చారట. దీంతో రఘువీరాకు సునీత సహకారం ఆగిపోవడం....అక్కడ ఆయన ఓటమిపాలవ్వడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో రఘువీరా....తనకు కలిసివచ్చిన కల్యాణదుర్గంపై పోకస్ చేస్తున్నాడని, ఆ క్రమంలోనే అక్కడి చెరువుకు నీరివ్వాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి, రఘువీరా ప్రపోజల్ కు టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.