ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం సమీపంలో కాళ్ల మండలం పెద అమిరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ హోదాలో రఘురామకృష్ణరాజు వద్దామని చివరి వరకు ప్రయత్నాలు చేసినా ఆయన ప్రయత్నాలన్నీ వమ్ము అయిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రఘురామ హైకోర్టును కూడా ఆశ్రయించారు. తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని కోరారు. పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలు కూడా తెచ్చుకున్నారు. దీంతో హైదరాబాద్ లోని లింగంపల్లి నుంచి వచ్చే రైలులో భీమవరం బయలుదేరారు. అయితే జూలై 3 రాత్రి బేగంపేట రైల్వే స్టేషన్ లోనే రఘురామ దిగిపోయి వెళ్లిపోయారు. హెలిప్యాడ్ వద్ద ప్రధానికి స్వాగతం పలికేవారి జాబితాలోనూ, వేదికపై ప్రధానితోపాటు కూర్చునేవారి జాబితాలోనూ తన పేరు లేదని తెలియడంతో రఘురామకృష్ణరాజు వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి.
మరోవైపు ఎంపీ రఘురామకృష్ణరాజు భీమవరం రాలేకపోయినా ఆయన అభిమానులు, అనుచరులు మాత్రం సందడి చేశారు. భీమవరం పట్టణంలో ఆయనకు మద్దతుగా బైక్ ర్యాలీ చేశారు. పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా మెగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీ అంతా రఘురామకృష్ణరాజు ఫోటోలు చేతపట్టి.. బైకర్లు 'జై ఆర్‌ఆర్‌ఆర్', 'జై జై ఆర్‌ఆర్‌ఆర్' అంటూ నినాదాలు చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ ఫోటోలతో కూడిన జెండాలను పట్టుకున్నారు. దీంతో భీమవరం పట్టణంలో రాజకీయంగా ఆసక్తికర వాతావరణం నెలకొంది.
మరోవైపు ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధానికి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎంపీ అయిన తనను ఆహ్వానించకుండా అధికారులు ప్రొటోకాల్ ను తీవ్రంగా ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ రాశారు. అంతేకాకుండా తన అనుచరులను స్థానిక పోలీసులు అరెస్టు చేసి కొట్టారని ఆ లేఖలో ప్రధానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
అలాగే హైదరాబాద్ లో రైలు దిగి ఇంటికెళ్లిపోయాక ఒక వీడియో విడుదల చేశారు.. ఎంపీ రఘురామ. అందులో కొన్ని విషనాగులు పాలకులైతే పరిస్థితులు ఇలాగే ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. విషనాగులే పాలకులవుతారని.. ఆనాడు అంబేద్కర్ అనుకోలేదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులుంటాయని తెలిస్తే రాజ్యాంగాన్ని మరోలా రాసేవారని తెలిపారు. ఇలాంటి నాయకులు ఏపీని పాలిస్తుండడం దురదృష్టకరమన్నారు.
ప్రధాని మోడీ భీమవరం పర్యటన జాబితాలో తన పేరు లేదని తెలిసి ఆశ్చర్యపోయానని రఘురామరాజు చెప్పారు. ముందే ప్రొటోకాల్ సమస్యలపై కేంద్రానికి లేఖ రాశానని, అయినా తన పేరును జాబితాలో ఎందుకు చేర్చలేదో అర్థం కావట్లేదన్నారు. కోర్టులు ఆదేశించినా పట్టించుకోకపోతే ఏమనాలి? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.