సాక్షిపై 50 కోట్ల పరువు నష్టం దావా వేసిన రఘురామ

Update: 2021-06-16 16:30 GMT
సీఎం జగన్ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి మీడియా గ్రూపుకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లీగల్ నోటీసులు పంపారు. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా తనకు వ్యతిరేకంగా, న్యాయవిరుద్ధంగా అనేక కథనాలు ప్రసారం చేసినందుకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని.. వారం రోజుల్లో స్పందించకుంటే చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

సాక్షి మీడియాకు పంపిన నోటీసుల్లో పదిహేను రోజుల్లో నోటీసుకు సమధానం ఇవ్వాలని రఘురామ స్పష్టం చేశారు. లేదంటే 50 కోట్ల పరువునష్టం దావా దాఖలు చేస్తామని రఘురామ హెచ్చరించారు.ఇందిరా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ భారతీ రెడ్డితో సహా సాక్షి మీడియాలో కీలక స్థానాల్లో ఉన్న పలువురి పేర్లతో నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. నోటీసుతో పాటుగా తన పైన ప్రసారమైన కధనాలను సైతం జత చేసినట్లు సమాచారం.  

ఇక రఘురామ నోటీసులపై సాక్షి మీడియా గ్రూపు అధికారికంగా ఇప్పటిదాకా స్పందించలేదు. లీగల్ గానే ప్రోసీడ్ కావాలని వారు డిసైడ్ అయినట్టు ప్రచారం సాగుతోంది.
Tags:    

Similar News