తిట్టే నోరు తిరిగే కాలు ఊరికే ఉండదు అనే సామెత తెలుగులో చాలా పాపులర్. ఈ సామెత నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపి కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు సరిగ్గా సరిపోతుంది. అలాంటి ఎంపికి ఇపుడు చాలా కష్టమే వచ్చపడింది. ఎందుకంటే రఘురామరాజు వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు. అలాంటిది ఎంపి అరెస్టు, కస్టడీలో సీఐడీ అధికారులు కొట్టారనే ఆరోపణలను విచారించిన సందర్భంగా సుప్రింకోర్టు ఎంపిని ఎక్కడా మాట్లాడద్దని ఆదేశించి నోరుకట్టేసింది.
ఇక ఆర్మీ ఆసుపత్రి నుండి డిస్చార్జయిన ఎంపి నేరుగా ఢిల్లీకి వెళ్ళిపోయారు. అక్కడ ఎయిమ్స్ లో చేరి మరిన్ని పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో పాదాల్లోని సెల్స్ బాగా దెబ్బతిన్నాయని తేల్చిన వైద్య నిపుణులు ఎంపి రెండు కాళ్ళకు+పాదలకు కలిపి ప్లాస్టర్ ఆప్ ప్యారిస్ (పీవోపీ) కట్టు కట్టేశారు. అంతేకాకుండా రెండు వారాలపాటు ఎక్కడా తిరక్కూడదని చెప్పారు. అంటే సుప్రింకోర్టు ఆదేశాల కారణంగా నోరిప్పలేకపోయిన ఎంపి ఎయిమ్స్ నిపుణుల కారణంగా చివరకు తిరగటానికి కూడా లేకపోయింది.
2019 ఎన్నికల్లో గెలిచిన కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డికి ఎంపికి ఎక్కడో చెడింది. దాంతో పార్టీకి జగన్ కు దూరమైన రఘురామ తిరుగుబాటు ఎంపిగా తయారయ్యారు. ఎంపి పరిస్ధితిని గమనించిన ప్రతిపక్షాలు అడ్వాంటేజ్ తీసుకుని జగన్ కు వ్యతిరేకంగా ఎంపిని బాగా దువ్వారు. దాంతో రెచ్చిపోయిన ఎంపి జగన్ వ్యతిరేక మీడియా అండతో నోటికొచ్చినట్లు మాట్లాడి చివరకు కేసులో తగులుకున్నారు.
సుప్రింకోర్టులో కేసు తెమిలేంతవరకు రఘురామ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ నోరిప్పిందేకు లేదు. కాబట్టి కొంతకాలం ఎంపి ఎక్కడా కనబడరన్నది వాస్తవం. ఇక ఎయిమ్స్ నిపుణుల విషయానికి వస్తే కనీసం రెండువారాల పాటు రెస్టవసరమి పీవోపీ వేసేశారు. ఆ తర్వాత కాళ్ళు, పాదాలను పరీక్షించిన తర్వాత నిపుణులు ఏమంటారో చూడాలి. కట్టిన కట్లు తీసేసినా, ఆరోగ్యం చేకూరినా ఎంపి అయితే ఢిల్లీని వదిలి బయటకు వస్తారని అనుకునేందుకు లేదు. మరి చూడాలి నోరు, కాలు కట్టేసుకుని ఎంతకాలం ఉంటారో.