వైస్సార్సీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపి రోజుకో కొత్త విషయం బయటపెడుతున్నారు. రాజద్రోహం ఆరోపణలపై సీఐడీ అధికారుల అరెస్టు మరుసటిరోజు హైకోర్టులో బెయిల్ అప్లికేషన్ పెట్టుకున్నారు. బెయిల్ పిటీషన్ను హైకోర్టు కొట్టేసి జిల్లా కోర్టులోనే తేల్చుకోమని చెప్పింది. ఇక అప్పటి నుండి కస్టడీలో తనను సీఐడీ పోలీసులు కొట్టారంటు గోల మొదలుపెట్టారు ఎంపి. అరెస్టు చేసిన మరుసటిరోజు ఉదయం డాక్టర్లకు తనను కొట్టిన విషయం ఎంపి చెప్పలేదు.
హైకోర్టు విచారణలో కూడా తనను కొట్టిన విషయం చెప్పలేదు. అదేరోజు మధ్యాహ్నం తనకు భోజనం తెచ్చిన కుటుంబసభ్యులకు కూడా ఆ విషయం చెప్పలేదు. ఎప్పుడైతే బెయిల్ పిటీషన్ రద్దయ్యిందని తెలిసిందో అప్పటి నుండి సీఐడి అధికారులు కొట్టారనే ఆరోపణలు మొదలుపెట్టారు. కస్టడీలో ఉన్న తనను గుర్తుతెలీని ఐదుగురు కర్ర, రబ్బర్ లాఠీలతో పాదాలపై కొట్టారని చెప్పారు.
అయితే తాజాగా పార్లమెంటరీ కమిటి ఛైర్మన్, సభ్యులకు రాసిన లేఖల్లో తనను కర్ర లాఠీలు, రబ్బర్ బెల్టులతో కొట్టారని చెబుతున్నారు. నోట్లో గుడ్డలు కుక్కేసి, ఛాతిపై కూర్చున్నట్లు ఆరోపించారు. తాజాగా పార్లమెంటరి కమిటికి చేసిన ఫిర్యాదులోని అంశాలు అప్పట్లో జిల్లా సెషన్స్ కోర్టు విచారణలో చెప్పలేదు. పార్లమెంటరీ కమిటికి చేసిన ఫిర్యాదు నిజమే అనుకుంటే మరప్పుడే నోట్లో గుడ్డలు కుక్కారని, ఛాతిపై కూర్చున్నారనే విషయాన్ని ఎందుకు చెప్పలేదు ?
పైగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కేసు వేసినందుకే తనపై కక్ష పెట్టుకుని రాజద్రోహం కేసు పెట్టి హింసించినట్లు ఆరోపిస్తున్నారు. అయితే ఎంపిపై రాజద్రోహం కేసు పెట్టింది బెయిల్ రద్దు పిటీషన్ వేసినందుకు కాదు. జగన్ను వ్యక్తిగతంగా దూషించినందుకు, జగన్ కులం ప్రస్తావించి జనాలను రెచ్చగొట్టినందుకు, క్రిస్తియన్లు-హిందువుల మధ్య విభేదాలు సృష్టించేలా మాట్లాడారనే ఆరోపణలపై కేసులు పెట్టారు. తమ వాదనకు మద్దతుగా ఎంపి మాట్లాడిన వీడియోలను కూడా సీఐడీ కోర్టుకు అందించింది.
సరే కేసులు ఎందుకు ప్రభుత్వం పెట్టింది, ఎంపి జగన్ లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమి మాట్లాడారనే విషయాన్ని పక్కనపెట్టేస్తే సీఐడీ ట్రీట్మెంట్ పై రోజుకో ఆరోపణ చేస్తుండటమే విచిత్రంగా ఉంది. ఒకరోజు రబ్బర్ లాఠీలతో కొట్టారంటారు. మరుసటి రోజు రబ్బర్ బెల్టుతో కొట్టారంటారు. మొదట్లో తన కాళ్ళను ఇనుపతీగతో చుట్టారన్నారు. ఇపుడా విషయాన్నే ప్రస్తావించటంలేదు. ఇపుడేమో నోట్లో గుడ్డలు కుక్కారని, ఛాతీపై కూర్చున్నారని చెప్పారు. మరి రేపు ఇంకెవరినైనా కలిసినపుడు కొత్త ఆరోపణలు ఇంకేమి చేస్తారో ? చూడాల్సిందే.