నాపై అనర్హత వేటు సాధ్యం కాదు: రఘురామ

Update: 2021-06-12 07:30 GMT
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి తనను ఎంపీగా అనర్హుడిగా ప్రకటించడం సాధ్యం కాదని కుండబద్దలు కొట్టారు. ఢిల్లీలో తనను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీల తీరుపై రఘురామ స్పందించారు.

ఇటీవల వైసీపీ ఎంపీ మార్గాని భరత్ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఎంపీ రఘురామ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని.. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఇకసీఎం జగన్ ఢిల్లీలో ఉండడంతో ఆయన కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది.

ఈ పరిణామాలపై ఎంపీ రఘురామ స్పందించారు. తనపై అనర్హత వేటు సాధ్యం కాదని.. పార్టీకి విరుద్ధంగా వ్యవహరించలేదని రఘురామ క్లారిటీ ఇచ్చారు. ఏ పార్టీతోనూ జత కట్టలేదని.. పథకాల అమలులో లోపాలను మాత్రమే ప్రస్తావించానని చెప్పారు.

కొంత మంది తప్పుడు వ్యక్తుల నుంచి పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేశానని.. వాస్తవాలు ఎప్పటికైనా బయటకు వస్తాయని రఘురామ వివరణ ఇచ్చారు.
Tags:    

Similar News