ఎంపి భవిష్యత్ తేలిపోతుందా ?

Update: 2021-06-30 07:30 GMT
వైసీపీ తిరుగుబాటు ఎంపి విషయం తొందరలోనే తేలిపోతుందా ? అవుననే అంటున్నారు వైసీపీ నేతలు. వచ్చే నెల 19వ తేదీ నుండి ఆగష్టు 13వ తేదీవరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లోనే ఎంపిపై అనర్హత వేటు విషయం ఫైనల్ అయిపోతుందని వైసీపీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే మూడుసార్లు ఎంపిపై అనర్హత వేటు విషయమై వైసీపీ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు రిమైండర్లు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈమధ్య జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో  హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి దాదాపు గంటన్నరపాటు భేటి అయిన విషయం తెలిసిందే. ఈ భేటిలో రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు చర్చించారు. అయితే ఇదే సమయంలో రాజకీయ వ్యవహారాలు కూడా చర్చించారు. ఇందులో ఎంపిపై అనర్హత వేటు వేయటం కూడా కీలకమైనదే. ఎంపిపై అనర్హత వేటు వేయటంలో అమిత్ ను జగన్ ఒప్పించినట్లు సమాచారం.

ఇదే విషయమై ఓం బిర్లాకు కూడా అమిత్ తగిన ఆదేశాలు ఇఛ్చారట. దీని తర్వాత లోక్ సభ చీఫ్ విప్ మార్గాని భరత్ లోక్ సభ స్పీకర్  కలిసి ఎంపిపై అనర్హత వేటుకు సంబంధించి రిమైండర్ ఇచ్చారు. అనర్హత వేటు విషయం ప్రస్తుతం లోక్ సభ సెక్రటరేయట్ పరిశీలనలో ఉందని తెలిసింది.  ఈ విషయం ఎంపికి కూడా తెలియటంతోనే టెన్షన్ పడుతున్నారు. పదే పదే తనపై అనర్హత వేటు వేయద్దంటు స్పీకర్ ను కలిసి విజ్ఞప్తులు చేస్తున్నారు.

ఒకవైపు జగన్ కు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేసి, మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోటికొచ్చినట్లు మాట్లుడుతు, బహిరంగ లేఖలు రాస్తు మళ్ళీ తాను పార్టీ నియమావళిని ఉల్లంఘించలేదని చెప్పటం రఘురామకృష్ణంరాజుకే చెల్లింది. కాబట్టి ఎంపి పై వైసీపీ ఇచ్చిన అనర్హవ వేటు అంశంపై తొందరలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లోనే స్పీకర్ నిర్ణయం ప్రకటిస్తారని పార్టీ నేతలు ఆశాభావంతో ఉన్నారు.
Tags:    

Similar News