జ‌గ‌న‌న్న స్మార్ట్ టౌన్ షిప్‌లో పెట్టుబ‌డి పెట్టొద్దు.. ఆర్ ఆర్ ఆర్ పిలుపు

Update: 2022-01-13 13:30 GMT
వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజు..ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్.. ప్ర‌జ‌ల‌కు సంచ‌ల‌న పిలుపునిచ్చారు. వైసీపీ ప్ర‌భుత్వం తాజాగా తీసుకు వ‌చ్చిన జ‌గ‌నన్న టౌన్ షిప్ ప‌థ‌కంలో ఎవ‌రు చేర‌వ‌ద్ద‌ని.. పెట్టుబడులు పెట్ట‌వ‌ద్ద‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఇది జ‌గ‌న‌న్న స్వామా ప‌థ‌క‌మ‌ని ఆర్ ఆర్ ఆర్ అభివ‌ర్ణించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌స్తుతానికి ఆరు ప్రాంతాల్లో గుర్తించిన జిల్లాల్లో ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు.

తాజాగా ఆర్ ఆర్ ఆర్ .. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం ప‌శ్చిమ‌లోని న‌ర‌సాపురంలో ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యిం చుకున్నారు. సంక్రాంతి స‌మ‌యంలో సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఉండాల‌ని భావించారు. అయితే.. ఇంత లోనే ఆయ‌న సీఐడీ అధికారులు నోటీలు ఇచ్చారు. సీఎంను దూషించిన కేసులో విచార‌ణ‌కు ఈ నెల 17న హాజ‌రు కావాలంటూ.. ఆదేశించారు.

ఈ క్ర‌మంలో మ‌రింత ఘాటుగా స్పందించిన ర‌ఘురామ‌.. స‌ర్కారు చేప‌ట్టిన ప‌థ‌కం కేవ‌లం దండుకునే ప‌థ‌క‌మ‌ని వ్యాఖ్యానించారు. ``మ‌న సీఎం ద‌గ్గ‌ర రోడ్లు వేసేందుకు డ‌బ్బులు లేవు. కానీ, ఆయ‌న మాత్రం ప్లాట్లు వేసి అమ్ముతాన‌ని.. అన్ని ర‌కాల మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తాన‌ని ప్ర‌కటిస్తూ.. జ‌గ‌న్న టౌన్ షిప్ ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చారు. ఈ ఫ్లాట్ల‌ను మార్కెట్ ధ‌ర‌ల క‌న్నా కూడా చౌక ధ‌ర‌ల‌కే విక్ర‌యిస్తామ‌ని చెబుతున్నారు. కానీ, ఇప్పుడు నిర్ణ‌యించిన ధ‌ర‌లు. మార్కెట్ రేటుక‌న్నా ఎక్కువ‌గా ఉంద‌ని.. ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో కొనేవారు.. ఎవ‌రి మాట న‌మ్మాలో తెలియ‌క ఇబ్బంది ప‌డుతున్నారు`` అని ఆర్ ఆర్ ఆర్ వ్యాఖ్యానించారు.

అదేస‌మ‌యంలో ఆర్ ఆర్ ఆర్ మరో కీల‌క విష‌యాన్ని లేవ‌నెత్తారు. స్మార్ట్ టౌన్ షిప్ ప‌థ‌కాన్ని ప్రారంబిం చే స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ప్ర‌శ్నించారు. ``ఈ ప‌థ‌కాన్ని వ‌ర్చువ‌ల్‌గా ప్రారం బించిన సీఎం.. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌గిరిలోని న‌వులూరు  ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న టౌన్ షిప్‌.. రాజ‌ధాని ప్రాంతానికి కేవ‌లం 10 కిలో మీట‌ర్ల ప‌రిధిలో ఉంటుంద‌ని, సెక్ర‌టేరియెట్ కు కేవ‌లం 15 కిలో మీట‌ర్ల దూరంలో ఉంటుంద‌ని.. హైకోర్టుకు కూడా అంతే దూరంలో ఉంటుంద‌ని  చెప్పార‌ని.. అయితే.. ఇది వివాదంగా మారింద‌ని ఆర్ ఆర్ ఆర్ అన్నారు.

కొన్ని రోజుల కింద‌టే.. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ మూడు రాజ‌ధానుల బిల్లును ప్ర‌వేవ ప‌ట్ట‌నున్నామ‌ని, దీంతో హైకోర్టు , సెక్రటేరియెట్ క‌ర్నూలుకు త‌ర‌లిపోతాయ‌ని చెప్పార‌ని, మ‌రి ఈ రెండు విష‌యాల్లో సీఎం జ‌గ‌న్‌ను న‌మ్మాలా?  మంత్రి బొత్స‌ను న‌మ్మాలా? అనే డైల‌మా ఏర్ప‌డింద‌ని ఆర్ ఆర్ ఆర్ అన్నారు.  అంతేకాదు.. జ‌గ‌న‌న్న మూడేళ్ల పాల‌న‌లో క‌నీసం ఒక్క ఇంటిని కూడా పేద‌ల‌కు ఇచ్చిన రికార్డు లేద‌ని విమ‌ర్శించారు. ఇలాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఇప్పుడు జ‌గ‌న‌న్న టౌన్ షిప్‌ల తో మ‌రోసారి మోస‌పోతామేమోన‌నే భ‌యం ప్ర‌జ‌ల‌లో ఉంద‌ని ర‌ఘురామ వ్యాఖ్యానించారు.

ప్ర‌జ‌ల‌కు ఈ విష‌యంలో మ‌రో సందేహం కూడా ఉంద‌ని చెప్పారు. జ‌గ‌న‌న్న టౌన్ షిప్‌ల కింద ప్ర‌జ‌ల నుంచి సేక‌రించే నిధుల‌ను వేరే ప‌థ‌కాల‌కు మ‌ళ్లిస్తార‌నే సందేహాలుఉన్నాయ‌ని, ఇది కూడా గ‌తంలోని హ్యాపీ నెస్ట్ మాదిరిగానే మారుతుంద‌నే భ‌యం ఉంద‌న్నారు. ఈ క్ర‌మంలో టౌన్ షిప్‌ల‌కింద క‌ట్టిన సొమ్ములు.. వేరే ప‌థ‌కాల‌కు మ‌ళ్లిస్తే.. ఇక‌, జ‌గ‌న్ చెబుతున్న‌ట్టు టౌన్ షిప్‌ల‌లో రోడ్లు, ఇత‌ర మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న సాధ్యం కాద‌ని.. హెచ్చ‌రించారు.  

ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు జ‌గ‌న‌న్న టౌన్ షిప్‌ల‌లో చేరి మ‌రోసారి అగ్రిగోల్డ్ బాదితుల మాదిరిగా, అమ‌రావ‌తి రైతుల మాదిరిగా మారొద్ద‌ని పిలుపునిచ్చారు. వైసీపీ పాల‌న‌లో ప్ర‌జ‌ల జీవితాలు అన్ని విధాలా నాశ‌నం అవుతున్నాయ‌ని.. విమ‌ర్శించారు.  నియంత పాల‌న‌కు ఇప్ప‌టికైనా స్వ‌స్తి ప‌ల‌కాల‌ని, పోలీసుల‌ను అడ్డు పెట్టుకుని సృష్టిస్తున్న విధ్వంసాల‌ను ఆపాల‌ని అన్నారు. కేంద్రం నుంచి పంచాయ‌తీల‌కు విడుద‌లైన నిధుల‌ను దారిమ‌ళ్లి మీరు వాడుకోవ‌ద్దు! అంటూ.. సీఎం జ‌గ‌న్కువ ఇజ్ఞ‌ప్తి చేశారు.  పార్టీల‌కు, కులాల‌కు అతీతంగా ప్ర‌జ‌లంతా ఒక్క‌టై.. జ‌గ‌న్‌ను ఓడించాల‌ని పిలుపునిచ్చారు. 
Tags:    

Similar News