సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజ్యాంగం చదువుకోవాలని ఎంపీ రఘురామ సెటైర్లు వేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన రాజ్యాంగాన్ని గౌరవిస్తే 200 కేసులను ఓడిపోయేవాళ్లం కాదన్నారు. రాజ్యాంగం ఫాలో కావాలన్నందుకే తనను కొట్టారని చెప్పుకొచ్చారు.
ఒక ఎంపీ తన నియోజకవర్గంలో తిరిగే హక్కు కూడా ఏపీలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అర్ధరాత్రి సమయంలో జీవోలు అమలు చేసి జిల్లాల విభజన చేపడుతున్నారని.. పార్లమెంట్ ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటని అంటున్నారని.. అర్ధరాత్రి జిల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.
కేబినెట్ లో జిల్లాలపై చర్చ జరుగకుండానే అర్ధాంతరంగా తీసుకురావాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టకుండా జిల్లాల విభజన చేయాలని రఘురామ సూచించారు.
టీడీపీ నేత అశోక్ బాబుపై అక్రమ కేసులు పెట్టారని ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు. అశోక్ బాబు చదివిన చదువు ఉద్యోగానికి సరిపోతుందని అన్నారు.
ఐదోతరగతి చదువుకున్న వారికి మంత్రి పదవి ఇచ్చారని.. సలహాదారులను కూడా నియమించారని ఎంపీ రఘురామ ఎద్దేవా చేశారు.