జగన్ నా వల్ల కాదు అనాల్సిందేనట... ?

Update: 2022-02-08 02:30 GMT
ముఖ్యమంత్రి జగన్ పట్టుదల అందరికీ తెలిసిందే. ఆయన అనుకుంటే వెనక్కు తగ్గరు. అయితే అన్నీ కోరుకున్నట్లుగా చకచకా జరిగిపోవు కదా.  పాలనా పరమైన విషయాలలో చూస్తే ఎన్నో  వ్యవస్థలు ఉంటాయి. అక్కడఏ విషమైనా బాగా ఆలస్యమైతే  కావచ్చు. రాజ్యాంగబద్ధమైన కొన్ని వ్యవహారాలలో ఎంత ఆత్రపడినా ఫలితం త్వరగా  ఉండదు, అదే ఇపుడు వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణం రాజుకు వరంగా మారుతోంది. అందుకే ఆయన జగన్ని సవాల్ చేస్తున్నారు.

నేను రాజీనామా చేయడం కాదు, జగన్ నా వల్ల కాదు అని ఒప్పుకోవాలి. ఇదీ రాజు గారు పెట్టిన లేటెస్ట్ కండిషన్. ఫిబ్రవరి 5న తాను రాజీనామా చేస్తాను అని ఎక్కడా అనలేదని ఆయన చెబుతున్నారు. ఇక ఈ నెల 11 వరకూ కూడా తాను వైసీపీకి టైమ్ ఇచ్చానని ఆయన గుర్తు చేస్తున్నారు. అది తన మీద అనర్హత వేటు వేయించేందుకు ఇచ్చిన గడువు తప్ప తన రాజీనామాకు ముహూర్తం కాదని పక్కా క్లారిటీగా చెబుతున్నారు.

ఈ టైమ్ లోగా మా వల్ల కాదు అని జగన్ అంటేనే తాను రాజీనామా చేస్తాను అని రాజు గారు చెబుతున్నారు. రాజీనామా చేయమని జగన్ చెప్పాలన్నది రాజు గారి తాజా డిమాండ్ గా ఉందని అంటున్నారు.

ఇక రాజు గారు ఫిబ్రవరిలో రాజీనామా చేస్తారని, నర్సాపురానికి ఎన్నిక వస్తుందని ఈ మధ్యనంతా విపరీతంగా ప్రచారం జరిగింది. అది కూడా ఫిబ్రవరి 5 అన్న డెడ్ లైన్ ఆయనే విధించారు అని కూడా చెప్పుకున్నారు. కానీ అదంతా కాదండీ జగన్ కి వల్ల కాదని ఒప్పుకోమండి అని రాజు గారు ఇపుడు సవాల్ చేస్తున్నారు.

వైసీపీ అయితే రెండేళ్లుగా రాజు మీద అనర్హత వేటు వేయించాలని చూస్తోంది. ఈ విషయంలో కరోనా మొదటి దశలో మంచి పీక్స్ మీద  ఉన్న టైమ్ లోనే ప్రత్యేక  ఫ్లైట్ వేసుకుని మరీ వైసీపీ ఎంపీల బృందం స్పీకర్ ని కలసి వినతిపత్రం ఇచ్చింది. ఆ తరువాత చూసుకున్నా కూడా ఢిల్లీలో ఎపుడూ వైసీపీ నేతలు ఈ అంశం మీదనే కేంద్ర పెద్దలకు వత్తిడి పెడుతున్నారు.

అయితే ఇపుడు అనర్హత అంశం లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ ముందుకు వచ్చింది. అక్కడ నుంచి నోటీసులు రాజు గారికి రావాలి. ఆయన తన సమాధానం చెప్పాలి. దాని మీద ప్రివిలేజ్ కమిటీ  ఆలోచించి  ఒక నిర్ణయం తీసుకుని దాన్ని స్పీకర్ ఆఫీస్ కి తెలియచేయాలి. చూడబోతే ఇది కూడా చాన్నాళ్ళ పాటు నడిచే తతంగంగానే ఉంది.

అయితే సరిగ్గా ఈ సమయంలో రాజు గారు వైసీపీ వారిని ఇరిటేట్ చేస్తున్నారు. తన మీద అనర్హత వేటు వేయించడం వైసీపీ వారి వల్ల కాదని ఆయన గట్టిగా డిసైడ్ అయినట్లుగా ఉన్నారు. అందుకే నేను రాజీనామా చేయను, నా పైన అనర్హత పడదు అని భావిస్తూనే ఆయన వైసీపీ పెద్ద జగన్ కే సవాల్ చేస్తున్నారు.

వేటు వేయించడం నా వల్ల కాదు అని జగన్ ఒప్పుకుని  మీరే  రాజీనామా చేయండిరాజు గారూ అని అంటేనే అపుడు చేస్తాను అని రఘురామ  చెబుతున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ పెద్దలకూ రాజు గారికి మధ్య ఈ రాజకీయ యుద్ధం అలా కొనసాగుతూనే ఉంటుంది అని అర్ధమైపోతోంది.

ఈ రాజకీయ  కధ అలా ఇంటర్వెల్ లేకుండా సాగుతూనే ఉంటుందా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. రాజు గారి తాజా సవాల్ తో వైసీపీ వారికి నీరసం అయినా వచ్చి ఉండాలి, లేకపొతే నిరాశ అయినా కలిగి ఉండాలని అంటున్నారు. అయినా ఏదో మిణుకు మిణుకుమనే  ఆశతో రాజు గారి మీద  అనర్హత వేటు పడాలని  మీద పోరాడుతూనే ఉంటారని చెప్పవచ్చేమో.
Tags:    

Similar News